మనిషి రెండు రకాల ఆహారాలపై ఆధారపడతాడు. ఒకటి శాకాహారం. రెండవది మాంసాహారం. శాకాహారంలో చాలారకాలున్నాయి. ఇందులో మెరుగైన ఆరోగ్యం కోసం కావల్సింది ఆకుపచ్చని కూరగాయలు. ముఖ్యమైన ఆరు గ్రీనీ వెజిటెబుల్స్ గురించి తెలుసుకుందాం..
పాలకూర
పాలకూర ఈ సీజన్‌లో మంచి ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, ఫోలెట్‌తో పాటు మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. పాలకూర తినడం వల్ల కంటి చూపు పెరగడమే కాకుండా కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి కేటరాక్ట్ ముప్పు తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా..ఎముకలకు బలాన్నిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
కాలే ( క్యాబేజి జాతికి చెందిన ఆకుకూర)
కాలేను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, ఇ, కేలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, బి6. పొటాషియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. కాలేను డైట్‌లో భాగంగా చేసుకుంటే..ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. కేన్సర్‌ను నిరోధిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
గోధుమ గడ్డి ( వీట్ గ్రాస్)
గోధుమ గడ్డి మొలకల్ని గ్రీన్ క్లోరోఫిల్‌గా కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఎ, సి, ఇతో పాటు ఐరన్, కాల్షియం. జింక్, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియను పెంచుతుంది. వృద్ధాప్య ఛాయల్ని ఆలస్యం చేస్తుంది. రక్తాన్ని డీటాక్స్ చేయడంలో దోహదపడుతుంది.
క్లోరెల్లా
ఇందులో 50 శాతం ఉండేది ప్రోటీన్లే. అంతేకాకుండా విటమిన్ బి12, విటమిన్ సి, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇందులో ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్లోరెల్లాను ఆహారంలో భాగంగా చేసుకుంటే..ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఆందోళన తగ్గుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులకు క్లోరెల్లా ఓ చికిత్స కూడా. కేన్సర్ వృద్ధిని నిరోధిస్తుంది
స్పిరులినా
ఇది కూడా క్లోరెల్లా లాంటిదే. ఇందులో న్యూట్రియంట్లు, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, సెలేనియం, గామా లినోలెనిక్ యాసిడ్ ఉన్నాయి. ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా..ఎలర్జీ, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది. కేన్సర్ నివారిస్తుంది. లివర్ డ్యామేజ్, సిరోసిస్ వ్యాధుల్ని నియంత్రిస్తుంది.
బ్రోకోలి
ఇది క్యాబేజ్ జాతికి చెందింది. ఇందులో విటమిన్ ఎ, ఇ, పుష్కలంగా ఉంటాయి. మరోవైపు డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రోకోలీ డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. శరీర కణజాలాన్ని మరమ్మత్తు చేస్తుంది. ఎముకలు, చర్మ ఆరోగ్యం కలుగుతుంది. కేన్సర్ ముప్పు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also read: Boost Your Metabolism: జీర్ణ క్రియ సమస్యల వల్ల వచ్చే వ్యాధులు ఇవే.. వీటిని ఇలా 10 రోజుల్లో నియంత్రించవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook