భారతీ ఎయిర్టెల్ ఇటీవల దేశంలో ఎయిర్టెల్ 5జి సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ముంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగపూర్, వారణాసి నగరాల్లో 5జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్ 5జి సేవల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్టెల్ 5జి సేవలతో హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ ఛాటింగ్, ఇన్స్టంట్ అప్లోడ్ వంటివి మరింత వేగవంతం కానున్నాయి. ఎయిర్టెల్ 4జితో పోలిస్తే 30 రెట్లు అధిక వేగం అందుతుంది. ఎయిర్టెల్ 5జి స్మార్ట్ఫోన్లు కలిగిన కస్టమర్లు 5జి ప్లస్ సేవల్ని..ప్రస్తుతం ఉన్న డేటా ప్లాన్స్ తోనే అందుకుంటారు.
ప్రస్తుతం మీ దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్టెల్ 5జి వినియోగించేందుకు 5జి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా 5జి సిమ్ కార్డ్ అవసరం లేదు. ప్రస్తుతం మీ దగ్గరున్న 4జి సిమ్..5జిగా అప్‌గ్రేడ్ అవుతుంది. మీ స్మార్ట్ఫోన్లలో 5జి ప్లస్ నెట్వర్క్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
మీ స్మార్ట్‌ఫోన్‌లో 5జి నెట్వర్క్ ఎలా చెక్ చేసుకోవాలి
ముందుగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.5జి సపోర్ట్ చేస్తుంటే.. 5జి ప్లస్ బ్యానర్ కన్పిస్తుంది. ఆ బ్యానర్‌పై ట్యాప్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరున్న నగరంలో 5జి ఉందో లేదో ఎయిర్టెల్ చెక్ చేస్తుంది. మీ ఫోన్ 5జి సపోర్ట్ చేసేది అయుంటే..సెట్టింగ్స్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి నెట్వర్క్ పేజ్ ఓపెన్ చేసి 5జి ఎంపిక చేసుకోవాలి.
మీ ఫోన్లో 5జి నెట్వర్క్ ఎలా యాక్టివ్ చేయాలి
ముందు మీ ఫోన్లో సెట్టింగ్స్ మెనూ ఓపెన్ చేయాలి. ఆ తరువాత కనెక్షన్స్ లేదా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు 5జి ఆప్షన్ ఎంచుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కుడిచేతివైపు పైభాగంలో 5జి నెట్వర్క్ మోడ్ కన్పిస్తుంది.
Also read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook