India Women beat Sri Lanka Women in Asia Cup 2022: మహిళా ఆసియాకప్ 2022లో భారత్ బోణీ కొట్టింది. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా శుక్రవారం సిల్హెట్ ఔటర్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్య ఛేదనలో లంక 109 పరుగులకే ఆలౌట్ అయింది. హాసిని పెరెరా (30) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దయాలన్ హేమలత 3 పడగొట్టింది. హాఫ్ సెంచరీ బాదిన జెమీమా రోడ్రిగ్స్ (76; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్.. హర్మన్‌ప్రీత్ కౌర్ (33) కలిసి జట్టును ఆదుకుంది. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరితో పాటు పూజా వస్త్రాకర్ (1), రిచా ఘోష్ (9) ఔట్ అవడంతో భారత్ భారీ స్కోరు చేయలేదు. లంక బౌలర్లలో రనసింగె 3 వికెట్స్ పడగొట్టింది.
151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ చమరి అటపట్టు (5), మల్షా షెహానీ (9) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో హర్షిత మాధవి (26), హాసిని పెరెరా (30) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ పెవిలియన్ చేరిన అనంతరం లంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. నీలాక్షి డి సిల్వా (1), అనుష్క (5), రనసింగె (1), సుగందిక (4) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దయాలన్ హేమలత 3, పూజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 2 వికెట్స్ తీశారు.
Also Read: అంపైర్‌ను కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Also Read: పవన్ కళ్యాణ్ బూట్ల రేట్లపై చర్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook