Hyderabad City Police buy IND vs AUS 3rd T20I Tickets after Fans Injured: ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో గురువారం ఉదయం 10 నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం పోటెత్తారు.
జింఖానా గ్రౌండ్స్ మెయిన్ గేట్ వైపు నుంచి అభిమానులు ఒక్కసారిగా లోపలికి రావడంతో.. భారీ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
Video from secunderabad Gymkhana grounds.. already Situation is out of control.. many injured.. one side Already Making a Lathi charge . From the other side police men purchased T-20 tickets.. ?? #IndiavsAustralia #Uppalstadium
#Secundrabad #HCA @TelanganaDGP pic.twitter.com/hFC8QuGRqv— Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) September 22, 2022
ఇక క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం వచ్చిన అభిమానులను లాఠీఛార్జ్ పేరుతో పోలీసులు చితకబాదారు. పోలీసుల దెబ్బలకు జనం మొత్తం జింఖానా గ్రౌండ్స్ నుంచి పారిపోయారు. గ్రౌండ్ మొత్తం ఖాళీ కాగానే.. హైదరాబాద్ సిటీ పోలీసులు కౌంటర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశారు. ఓ ఇద్దరు పోలీసులు కౌంటర్ వద్ద నిల్చుని టికెట్స్ తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'దర్జాగా టికెట్స్ మొత్తం కొన్న హైదరాబాద్ పోలీసులు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'టికెట్స్ అన్ని రాజకీయనాయకులు, పోలీసులకేనా.. అభిమానులకు ఇవ్వరా' అని ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: IND vs AUS 3rd T20 Tickets: అభిమానులకు 10 వేల టికెట్లేనా.. మిగతా 29 వేల టికెట్స్ ఏమయినట్టు!
Also Read: బొంగులో టికెట్స్.. కొంచెం అయితే సచ్చేటోడిని! ** నా కొడుకు అజారుద్దీన్ వల్లే ఇదంతా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.