Shani Dev in dream: కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. శనిదేవుడి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, ఎన్నో పరిహారాలు చేస్తారు. సాధారణంగా ప్రజలు వారి డ్రీమ్స్ లో దేవుళ్లను దర్శించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు శనిదేవుడు కలలో (Shani Dev in dream) కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా.
>> కలలో శనిదేవుడు రాబందుపై కూర్చున్నట్లు కనిపిస్తే అది చాలా అశుభం. దీని కారణంగా ఆ వ్యక్తి జీవితంలో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. వారు చెడు వార్తలు వినాల్సి వస్తుంది.
>> శనిదేవుడు కాకిపై స్వారీ చేస్తూ కలలో కనిపిస్తే అది కూడా శుభప్రదం కాదు. అలాంటి కల వస్తే కొన్ని అశుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం. అంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
>> ఎవరైనా కలలో శని దేవుడిని పూజిస్తున్నట్లు కనిపిస్తే, అది సాధారణ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ప్రజలు శుభ మరియు అశుభ ఫలితాలను పొందుతారు. అలాంటి కల చూసినప్పుడు శని దేవుడికి సంబంధించిన పరిహారాలు చేయాలి.
>> శనిదేవుడు ఏనుగుపై కనిపిస్తే, అది చాలా శుభప్రదం. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. అంటే అతను తన కెరీర్లో పురోగతి సాధించబోతున్నాడని అర్థం. అంతేకాకుండా ఆ వ్యక్తి భారీ డబ్బును పొందబోతున్నాడని అర్థం.
>> శనిదేవుడు నెమలిపై కూర్చొని కలలో కనిపిస్తే, అతనికి మంచి జరుగుతుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. రాబోయే రోజుల్లో అతడు అనేక విజయాలను సాధిస్తాడు.
Also Read: Shani Margi 2022: మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి ఊహించని ధనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook