How To Reduce Belly Fat In 7 Days: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, మధుమేహం బారిన పడడం విశేషం. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా ఆహారపై ప్రత్యేక శ్రద్ధవహించాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆహారంపై శ్రద్ధవహించడమే కాకుండా రోజూ వ్యాయామాలు కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియమాలు పాటించడం వల్ల పొట్ట చుట్టు కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శరీర కొవ్వును తగ్గించుకోవడానికి పలు రకాల ఆయుర్వేద పద్ధతులను కూడా అనుసరించాల్సి కూడా ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ టీని తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
తయారికి కావాల్సిన పదార్థాలు:
>>ఒక కప్పు తరిగిన పైనాపిల్స్ ముక్కలు
>>1 టీస్పూన్ పసుపు పొడి
>>చిటికెడు జీలకర్ర పొడి
>>1 టేబుల్ స్పూన్ టీ ఆకులు
పైనాపిల్ టీని తయారీ విధానం:
ఈ టీ తయారు చేయడానికి.. ముందుగా ఒక కప్పు తరిగిన పైనాపిల్స్ ముక్కలు తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీస్పూన్ పసుపు పొడి, రెండు చిటికెడు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ టీ ఆకులు తీసుకుని వాటిని నీటిలో వేసి మరిగించాలి. 20 నిమిషాల తర్వాత ఇది గ్రీన్ టీల మారుతుంది. ఇలా తయారు చేసిన టీని సర్వ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే, ఈ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట చుట్టు పేరుకు పోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుంది.
దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం, జుట్టు మెరుగుపడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ టీ మధుమేహం, గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా సహాయపడుతుంది. ఈ టీని భోజనానికి ముందు ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మంచా ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఔషధంగా పని చేస్తుంది. కావున వీరు రోజుకు 2 నుంచి 3 కప్పుల టీ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook