ఫ్రాన్స్‌లోని కేన్స్ సిటీలో జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరయ్యేందుకు బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన గారాలపట్టి ఆరాధ్య బచ్చన్‌తో కలిసి వెళ్లింది. ఐష్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడం ఇది 17వ సారి. కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఈ శనివారం, ఆదివారం ఐష్ రెడ్ కార్పెట్‌పై హోయలొలికించనుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ బ్లాక్ కలర్ దుస్తుల్లో కేన్స్ వెళ్తూ ఎయిర్ పోర్టులో మీడియా కంటపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఐష్ సినిమా ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫన్నీ ఖాన్ సినిమాలో ఐష్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
బాలీవుడ్ అప్డేట్స్ ప్రకారం.. ఓ కౌన్ థీ అనే 1964 నాటి క్లాసిక్ హిట్ సినిమా రీమేక్‌లో ఓ ప్రధాన పాత్ర పోషించే అవకాశం సైతం ఐష్ తలుపు తట్టినట్టు సమాచారం. ఈ రీమేక్‌లో షాహీద్ కపూర్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి ఐశ్వర్య, ఆరాధ్య !