Rohit Sharma breaks Shahid Afridi's record: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగో టీ20లో రోహిత్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ ప్రస్తుతం 477 సిక్సర్లు బాదాడు. రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో 45 మ్యాచ్‌ల్లో 64 సిక్సర్లు కొట్టాడు. వన్డేల్లో 233 మ్యాచ్‌ల్లో 250 సిక్సర్లు బాదిన రోహిత్..టీ20 క్రికెట్‌లో132 మ్యాచ్‌లలో 163 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ కంటే ముందు వెస్టిండీస్ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ పేరిట 553 సిక్సర్లు ఉన్నాయి. నిన్నటివరకు రెండో స్థానంలో ఉన్న షాహిద్ అఫ్రిది (476) మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో న్యూజీలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ (398) నాలుగో స్థానంలో ఉన్నాడు. మార్టిన్ గప్తిల్ (379), ఎంఎస్ ధోనీ (359) టాప్-5లో ఉన్నారు. భారత్ తరఫున రోహిత్ శర్మ తర్వాత ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 410 మ్యాచులలో 477 సిక్సర్లు బాధగా.. ధోనీ 538 మ్యాచులలో 359 సిక్సర్లు కొట్టాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 664 మ్యాచులలో 264 సిక్సర్లు బాదాడు.
Also Read: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి జాక్ పాట్! ప్రమోషన్ పక్కా
Also Read: ఆదివారం నాడు ఈ చిన్న పనిచేస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయి! ఆలస్యం ఎందుకు మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ!
రోహిత్ శర్మ అరుదైన ఘనత
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రికార్డు బద్దలు
రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ