Weight Gain In 10 Days: ప్రస్తుతం చాలా మంది తప్పుడు సలహాల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే బరువును పెంచుకునే క్రమంలో తెలిసో.. తెలియకనో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్, పేస్ట్రీలు, కుకీలు, ఐస్ క్రీం వంటివి తింటున్నారు. ఇలా చేయడంతో వీరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే బరువు పెరగడానికి క్యాలరీలు రిచ్‌గా ఉండే ఫుడ్స్‌ను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు పెరగడనికి కచ్చితమైన డైట్ ప్లాన్‌తో ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా శరీరం దృఢంగా మారుతుంది.
ఇలా ఆరోగ్యంగా బరువును పొందండి:
బరువు తగ్గడానికి సరైనా డైట్ ప్లాన్స్‌ను అనుసరించడం చాలా మంచిది. పలువురు వైద్య నిపుణులు బరువు పెరగడానికి డైట్ ప్లాన్స్ కూడా సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి సహాయపడతాయని అందరూ నమ్ముతారు. కానీ కాదు.. కేవలం కేలరీలపై ఆధారపడి బరువు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే డైట్ ప్లాన్ అనుసరించడం చాలా ముఖ్యం.. అయితే ఈ డైట్ ప్లాన్‌లో అరటిపండ్లు, బంగాళాదుంపలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్రమం తప్పకుండా పాల్లో అవ్వడం వల్ల త్వరలోనే బరువు పెరుగుతారు.
డైట్ ప్లాన్‌లో ప్రధాన పాత్ర పోషించేవి ఇవే:
నట్స్:
బరువు పెరగడానికి నట్స్ చాలా ఉపయోగపడుతాయి. ఇందులో కొవ్వు, పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొన్ని డ్రై ఫ్రూట్ శరీరానికి అధిక పోషకాలు అందజేసి బాడీ బరువును పెంచుతాయి.
అరటి పండు:
అరటిపండులో ఉండే గుణాలు బరువు పెంచేందుకు కృషి చేస్తాయి. ఇందులో ఖనిజాలు అధిక పరిమాణంలో ఉండడం వల్ల దీని ద్వారా సురక్షితంగా బరువును పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. బరువును పెంచుకోవడానికి ప్రతిరోజూ 4 నుంచి 5 పండిన అరటిపండ్లను తినవచ్చు.
డార్క్ చాక్లెట్:
బరువు పెరగడానికి డార్క్ చాక్లెట్‌ను కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో క్యాలరీలు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ఇవి సులభంగా బరువు పెరిగేందుకు సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా.
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook