KCR RAJBHAVAN: గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! రాజ్ భవన్ లో కేసీఆర్ సందడే సందడి..

KCR RAJBHAVAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు.. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ వెళ్లడం కామన్. కానీ తెలంగాణలో మాత్రం అది స్పెషల్. దాదాపు తొమ్మిది నెలలుగా రాజ్ భవన్ ముఖం చూడలేదు కేసీఆర్.

Written by - Srisailam | Last Updated : Jun 28, 2022, 01:42 PM IST
  • 9 నెలల తర్వాత రాజ్ భవన్ కు కేసీఆర్
  • గవర్నర్ తమిళిసై తో సరదా ముచ్చట్లు
  • కిషన్ రెడ్డితో కేసీఆర్ గుసగుసలు
KCR RAJBHAVAN: గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! రాజ్ భవన్ లో కేసీఆర్ సందడే సందడి..

KCR RAJBHAVAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు.. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ వెళ్లడం కామన్. కానీ తెలంగాణలో మాత్రం అది స్పెషల్. దాదాపు తొమ్మిది నెలలుగా రాజ్ భవన్ ముఖం చూడలేదు కేసీఆర్. గవర్నర్ తమిళి సై తీరుపై గుర్రుగా ఉన్న కేసీఆర్ అటు వైపు వెళ్లలేదు. అటు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ తనను అవమానిస్తోందని ఓపెన్ గానే చెప్పారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిన సమయంలో కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లడం బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్ భవన్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ హడావుడి చేశారని తెలుస్తోంది. కొంత కాలంగా గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడని కేసీఆర్.. రాజ్ భవన్ లో సరదాగా గడిపారని తెలుస్తోంది. తనకు ప్రత్యర్థిగా చూసిన గవర్నర్ తమిళి సైతో ఆత్మీయంగా మాట్లాడారు. గవర్నర్ ఇచ్చిన తేనిటి విందులో పాల్గొన్న తమిళి సైతో చాలా క్లోజ్ గా మాట్లాడారు. కేసీఆర్ జోకులు కూడా వేశారని.. ఆయన వేసిన జోకులకు గవర్నర్ పగలబడి నవ్వారని తెలుస్తోంది. రాజ్ భవన్ విడుదల చేసిన ఫోటోల్లోనూ కేసీఆర్, తమిళి సై సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి ముఖాల్లోనూ చాలా సంతోషం కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత కలిసినందుకో ఏమో కేసీఆర్, గవర్నర్ ఎమోషనల్ అయ్యారని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఓ రేంజ్ లో ఫైటింగ్ జరుగుతోంది. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. కేసీఆర్ టార్గెట్ గా ఏకంగా బీజేపీ కార్యాలయం ముందు బోర్డు పెట్టారు కమలనాధులు. సాలు దొర.. సెలవు దొర పేరుతో క్రియేట్ చేసిన వెబ్ సైట్ దుమారం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ భవన్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సీజే ప్రమణస్వీకారం తర్వాత గవర్నర్ తేనేటి విందు సందర్భంగా కిషన్ రెడ్డి, కేసీఆర్ చాలా సేపు మాట్లాడుకున్నారు. గుసగుసలు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్, కేసీఆర్ జోకులు వేసుకుంటుండగా కిషన్ రెడ్డితో వాళ్లతో కలిసి నవ్వుతున్న వీడియోలు బయటికి వచ్చాయి. రాజ్ భవన్ లో జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారాయి.

సీజే గా జస్టిస్  ఉజ్జల్‌ భూయాన్‌  ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్ భవన్ వచ్చిన కేసీఆర్ కాసేపు గవర్నర్ ను పట్టించుకోలేదు. వేదికపై పక్క పక్కనే కూర్చున్నా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. సీఎంను తమిళి సై విష్ చేసినా ఆయన చూసిచూడనట్లుగా వ్యవహరించారని చెబుతున్నారు. అయితే సీజే ప్రమాణస్వీకారం తర్వాత సీన్ మారిపోయింది. తేనేటి విందులో గవర్నర్, ముఖ్యమంత్రి మాట్లాడుకున్నారు. ఒకే టేబుల్ పై కూర్చుని జోకులు వేసుకున్నారు.

READ ALSO: Kcr Rajbhavan: ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో గవర్నర్ తో కేసీఆర్ భేటీ.. విభేదాలు సమసిపోయినట్టేనా?

READ ALSO: TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... విద్యార్థులు ఇలా చెక్ చేసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News