Dinner Rules For Fat Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ ఫిట్‌నెస్‌పై ప్రభావితం అయ్యి.. శరీర రూపాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది పలు రకాల ఆహార నియమాలు పాటిస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా కొవ్వును తగ్గించుకునే క్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అయితే స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పలు రకాల సూచనలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రాత్రి తినే భోజనంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి తినేటప్పుడు ఈ నియమాలను పాటించండి:
సూర్యాస్తమయానికి ముందు రాత్రి భోజనం చేయండి:
బరువు తగ్గాలనుకునే వారు సూర్యాస్తమయానికి ముందు రాత్రి భోజనం చేయండం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మరుగు పడి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అటువంటి పరిస్థితిలో బరువుత కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున బరువు తగ్గాలనుకునే వారు డిన్నర్‌ను సూర్యాస్తమయానికి ముందు చేస్తే మంచిదని నిపుణులు భావిస్తున్నారు.
డిన్నర్లో మిల్లెట్ తినండి:
రాత్రి భోజనంలో మిల్లెట్ చేసిన మిల్లెట్ దోస, మిల్లెట్ పులావ్ తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చాలా రకాల పోషక విలువలుంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి.. శరీరాన్ని దృఢంగా చేస్తాయి.
సాయంత్రం పూట పౌష్టికాహారం తీసుకోవాలి:
సాయంత్రం వేళల్లో పోషక విలువలు అధికంగా ఉన్న ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పండ్లు, పాలు అధికంగా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.