Rainfall in Telangana: నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో సోమవారం (జూన్ 13) రాత్రి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడ, బండ్లగూడ ప్రాంతాల్లో 9.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని కాప్రా ప్రాంతంలో 8.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో 8.3 సెం.మీ, జుక్కల్‌లో 8సెం.మీ ఖమ్మంలో 7.6 సెం.మీ ఖమ్మం ఖానాపూర్‌లో 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందంటే :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాప్రాలోని చర్లపల్లి హెల్త్ సెంటర్ ప్రాంతంలో అత్యధికంగా 8.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అల్వాల్‌లో 5.6 సెం.మీ, హయత్‌నగర్‌లో 4.3 సెం.మీ, కుషాయిగూడలో 3.9సెం.మీ, సరూర్ నగర్‌లో 3సెం.మీ, ఉప్పల్ బండ్లగూడలో 2.8 సెం.మీ, నాచారంలో 2.8 సెం.మీ, జీడిమెట్లలో 2.4 సెం.మీ, కూకట్‌పల్లిలో 2.4 సెం.మీ , బహదూర్‌పురాలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తింది. రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరో 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు :
నైరుతి రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ ప్రభావంతో మరో 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Also Read: Siddhanth Kapoor: బెంగళూరు డ్రగ్స్ కేసు.. బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్
Also Read: Horoscope Today June 14th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.