Indigo Fined by DGCA: ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఇండిగో సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. ఈ విమానయాన సంస్థను వరుస విమాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా డీసీజీఏ 5 లక్షలు జరిమానా విధించింది.
సిబ్బంది దురుసు ప్రవర్తన, ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర విమర్శలతో తరచు వివాదాల్లో నిలుస్తున్న ఇండిగో సంస్థకు వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజాగా షాక్ ఇచ్చింది. అంగవైకల్యం ఉన్న బాలుడి పట్ల ఇండిగో సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సీరియస్ అయ్యింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. డీజీసీఏ నియమించిన ముగ్గురు సభ్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టింది.
మే 7న రాంచీ ఎయిర్‌పోర్టులో అమానవీయ ఘటన జరిగింది. కళ్లు సరిగ్గా కనిపించని ఓ బాలుడి పట్ల ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. కళ్లు సరిగ్గా కనబడవు అనే కారణం చూపి విమానంలోకి ఎక్కేందుకు అనుమతించలేదు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. రాంచీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని భావించిన ఆ బాలుడి కుటుంబానికి తీవ్ర అవమానం ఎదురైంది. తన కుమారుడిని విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది అనుమతించకపోవడంతో చేసేది లేక అతడి తల్లిదండ్రులు సైతం తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన డీసీజీఏ మే 9న ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది. అంగవైకల్యం ఉన్న బాలుడి పట్ల ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారని కమిటీ తేల్చింది. దివ్యాంగుడి పట్ల కనికరంతో వ్యవహరించాల్సి ఉందనీ కానీ అలా చేయలేదని తేల్చి చెప్పింది. పౌర విమానయాన నిబంధనలు, దాని స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇండిగో సిబ్బంది వ్యవహరించారని తన నివేదికలో స్పష్టం చేసింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టిన డీసీజీఏ ..ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ఐదు లక్షల జరిమానా విధించింది.
గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై పలు సందర్భాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయాణికులపై ఆ సంస్థ సిబ్బంది చెయ్యి చేసుకున్న ఘటనలు కలకలం రేపాయి. షట్లర్ పీవీ సింధు పట్ల అభ్యంతరకర రీతిలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అప్పట్లో దీనిపై పెను దుమారమే రేగింది. ఇండిగో తీరుపై పలువురు దుమ్మెత్తి పోశారు. ఇక గతంలో కూడా దివ్యాంగుల పట్ల సదరు విమానయాన సంస్థ సరిగ్గా వ్యవహరించలేదన్న విమర్శలు వచ్చాయి.
Also Read: Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...
Also Read: Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలో మహేంద్ర సింగ్ ధోనీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook