CM Kcr Tour: దేశంలో మూడో కూటమి తప్పదా..? ముగ్గురు సీఎంల కీలక భేటీ..!

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..దేశవ్యాప్త పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన పంజాబ్‌లో పర్యటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 06:58 PM IST
  • కొనసాగుతున్న సీఎం కేసీఆర్ టూర్
  • పంజాబ్‌లో చెక్కుల పంపిణీ
  • చండీగఢ్‌లో ముగ్గురు సీఎంల భేటీ
CM Kcr Tour: దేశంలో మూడో కూటమి తప్పదా..? ముగ్గురు సీఎంల కీలక భేటీ..!

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..దేశవ్యాప్త పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన పంజాబ్‌లో పర్యటించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాల్వాన్‌ లోయన్‌లో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. చండీగఢ్‌లో జరిగిన  ప్రత్యేక కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ పాల్గొన్నారు. 

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పంజాబ్ రైతులు పోరాడారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని చెప్పారు.  రైతు ఉద్యమంలో అసువులు బారిన 600 మంది రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపును ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. పంజాబ్‌ రైతులు చేసిన పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశ రక్షణలో పంజాబ్‌ యువకులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నా..మనదేశ పరిస్థితి మారలేదని తెలిపారు సీఎం కేసీఆర్. రైతుల సమస్యలకు ఇప్పటికీ పరిష్కరం దొరకడం లేదన్నారు. వ్యవసాయ రంగంపై కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని విమర్శించారు. పంటలకు రైతులు వాడుతున్న విద్యుత్‌కు మీటర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై బీజేపీని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా చూస్తున్నారని మండిపడ్డారు. 

అనంతరం పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్ మాన్ అధికారిక నివాసంలో ప్రత్యేక భేటీ జరిగింది. సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి వస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమిని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌  భావిస్తున్నారు. దీంతో దేశ రాజకీయాలు హీటెక్కాయి.

Also read:Sekhar Movie: జీవితా రాజశేఖర్‌ దంపతులకు షాక్..సినిమా నిలిపివేయాలని కోర్టు ఆదేశం..!

Also read:CM Jagan Tour: ఆంధ్రలో పెట్టుబడులు పెట్టండి..పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ ఆహ్వానం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News