KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారత్‌తో పాటు.. యూకేకి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు హాజరయ్యారు.
యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. ప్రపంచంతో పోటీపడుతూ భారత్ ముందుకు వెళ్లాలంటే విప్లవాత్మక పాలనా సంస్కరణలు అవసరమన్నారు. భారత జనాభాలో యువకుల సంఖ్యే అధికమన్న కేటీఆర్.. అవకాశాలను అందిపుచ్చుకుంటే అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓవైపు పాలనా సంస్కరణలను అమలు చేస్తూనే.. పెట్టుబడులకు సంబంధించి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడం వల్ల దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇదే స్ఫూర్తితో కొన్నేళ్లుగా ముందుకు పోతోందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఫలితంగా కొత్త రాష్ట్రమయినప్పటికీ తెలంగాణ దేశానికి ఓ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో అప్పటి గందరగోళ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పుడు ప్రపంచస్థాయి ప్రముఖ కంపెనీలను ఆకర్షించేలా పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేశామని, వీటికి పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ వివరించారు. కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్న కేటీఆర్.. ఆ ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించామని గర్వంగా చెప్పారు. ఈ వివరాలు తెలుసుకున్న సమావేశంలో పాల్గొన్న వాళ్లందరూ మంత్రి కేటీఆర్‌ని అభినందనల్లో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు, సాధిస్తున్న విజయాలు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావని, వాటిని భారత దేశ స్థాయి విజయాలుగా పరిగణనలోకి తీసుకొని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కృషిలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని, దేశం సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి చాటేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) విజ్ఞప్తి చేశారు.
Also read : Pawan Kalyan: తెలంగాణలో బలంగా ఉన్నాం.. వచ్చే ఎన్నిక్లలో సత్తా చాటుతాం! నల్గొండ పర్యటనలో పవన్ కల్యాణ్..
Also read : Jr NTR Birthday: తారక్‌ని చంద్రబాబు, బాలకృష్ణ పక్కకు పెట్టేశారా ? సాక్ష్యమిదేనా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
KTR London Trip: తెలంగాణ విజయాలపై లండన్ వేదికపై కేటీఆర్ ప్రస్తావన
దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ
రాష్ట్ర విజయాలు దేశ విజయాలుగా చూడాలి
బ్రిటన్ వేదికపై తెలంగాణ విజయ ప్రస్థానం చాటిన కేటీఆర్