/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Summer Drinks: దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. తాగిన నీళ్లు కాస్త చెమట రూపంలో మళ్లీ బయటకు వస్తాయి. ఇది ఎండాకాలంలో మరి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో మంచినీళ్లతో పాటు హెర్బల్‌ డ్రింక్స్‌ తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాఫీ, టీలు తాగడం కంటే కొన్ని ఫ్రూట్‌ జ్యూస్‌ లు తీసుకోవడం చాలా బెటర్‌ అంటున్నారు. 

నిమ్మకాయ, పుదీనా జ్యూస్‌:
పుదీనా ఆకులను కొద్దిగా నలిచి కాచి ఉంచిన నీళ్లలో గంటపాటు నానబెట్టాలి.  నీళ్లు చల్లారిన తర్వాత అందులో నిమ్మకాయ రసంతో పాటు కొంచెం ఐస్‌ కూడా వేయాలి. ఆ డ్రింక్‌ ను మరింత రిఫ్రెష్‌గా చేయాలనుకుంటే అందులో కొంచెం తేనేతో పాటు దొడ్డు ఉప్పు, చాట్‌ మసాలా కూడా వేయాలి. ఈ డ్రింక్‌ తీసుకోవడం వల్ల చల్లదనానికి చల్లదనంతో పాటు తిన్న ఆహారం జీర్ణమవుతుంది. 

ఫ్రూట్‌ పంఛ్‌:
పైనాపిల్‌, మామిడికాయ ముక్కలను కట్‌ చేసుకోని జ్యూస్‌ చేసుకోవాలి. ఈ రెండు జ్యూస్‌లను సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో మామిడికాయ గుజ్జుతో పాటు కొంచెం ఉప్పు, క్రషడ్‌ ఐస్‌ కూడా వేసుకోవాలి. కొంచెం డిఫరెంట్‌ టేస్ట్‌ కోరుకునేవారు ఫ్రెష్‌ క్రీమ్‌ ను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

పైనాపిల్‌ ఆరెంజ్‌ జ్యూస్‌:
పైనాపిల్‌, ఆరెంజ్‌ ఈ రెండు పండ్లతో ఎంతో రుచికరమైన జ్యూస్‌ చేసుకోవచ్చు. పైనాపిల్‌, ఆరెంజ్‌ లను చిన్నముక్కలుగా కట్‌ చేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్‌ తో పాటు స్ట్రాబెరీస్‌ ను కూడా యాడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని ఐస్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల తిన్న ఆహారం కూడా సులువుగా జీర్ణం అవుతది. ఎలాగూ ఆరెంజ్‌ జ్యూస్‌ లో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది.

వాటర్‌ మిలన్‌ జ్యూస్‌:
ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ కూడా ఎక్కువగా తీసుకునే ఫ్రూట్‌ ఏదైనా ఉందా అంటే అది తర్బుజకాయ. తర్బుజకాయను చిన్నముక్కలుగా కట్‌ చేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. అందులో కొంచెం నిమ్మకాయ రసంతో పాటు క్రషడ్‌ ఐస్‌ వేసుకోవాలి. దాంతో పాటు ఒక టీస్పూన్‌ రోస్‌ వాటర్‌ యాడ్‌ చేసుకుంటే టేస్ట్‌ అదిరిపోతుంది.

టమాట పుదీనా జ్యూస్‌:
టమాటలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. అందులో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. దాంతో పాటు కొంచెం నిమ్మకాయ రసం వేసుకోని ఐస్‌ ముక్కలు వేసుకోని తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. 

పైనాపిల్‌ కొబ్బరి జ్యూస్‌:
ముందుగా పైనాపిల్‌ ముక్కలను జ్యూస్‌ గా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొబ్బరిపాలు, ఐస్‌ యాడ్‌ చేసుకుని షేక్‌ చేసుకుని తాగితే ఫుల్‌ టేస్టీగా ఉంటుంది. 

పైనాపిల్‌ అల్లం జ్యూస్‌: 
పైనాపిల్‌ జ్యూస్‌ లో కొద్దిగా అల్లం, నిమ్మకాయ రసంతో పాటు తేనే యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం చక్కెర, ఐస్‌ వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

ఇలాంటి డ్రింక్‌ లు తీసుకోవడం వల్ల దాహం తీరడంతో పాటు శరీరానికి కొత్త శక్తి లభిస్తది. ప్రత్యేకించి ఎండాకాలంలో ఈ జ్యూస్‌ లు తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్‌ కాకుండా ఉంటుంది.

Also Read:Allu Arjun Gift: అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్... మురిసిపోయిన నవదీప్... థ్యాంక్స్ బావ అంటూ..

Also Read:India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Section: 
English Title: 
Juices to take in summer these are very easy to make ..!
News Source: 
Home Title: 

Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!

 Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!
Caption: 
Juices to take in summer these are very easy to make ..!(Source pexels)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దంచికొడుతున్న ఎండలు

ఫ్రూట్‌ జ్యూస్‌ లు తీసుకోవాలంటున్న వైద్యులు

ఇంట్లోనే ఫ్రూట్‌ జ్యూస్‌ చేసుకోవడం చాలా ఈజీ

Mobile Title: 
Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, May 14, 2022 - 11:21
Request Count: 
78
Is Breaking News: 
No