Bad Cholesterol: ఈ కూరగాయతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండిలా...!

Diet tips: శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాంటి ఓ కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 11:16 AM IST
Bad Cholesterol: ఈ కూరగాయతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండిలా...!

Benefits of Eating Lady Finger: మారిన జీవనశైలి, సరైన ఆహర తీసుకోకపోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండెపోటు, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం మనం సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అలాంటి ఓ కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol)ను తొలగించడమేకాకుండా...బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. 

బెండకాయతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
బెండకాయను ఇంగ్లీష్ లో లేడీ ఫింగర్ (Lady Finger) అంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పెక్టిన్ కూడా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ అనేక తీవ్రమైన వ్యాధుల మూలమన్న సంగతి మరచిపోకండి. 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది
బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఉదర సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉండేటట్లు చూస్తుంది. ఇది మధుమేహ (Diabetes) వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ పచ్చి కూరగాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కరోనా వైరస్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి రోగ నిరోధకశక్తిని (Immunity) పెంచుకోవాలని చాలా మంది అంటున్నారు. అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బెండకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు రోజువారీ ఆహారంలో ఈ కూరగాయను చేర్చుకుంటే మంచిది.

Also Read: Weight Loss in 15 Days: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News