Slogans at Minster Prasanth Reddy: కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. శంషాబాద్‌లో జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. 800 కోట్లతో 17 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గడ్కరీతో పాటు కేంద్ర మంత్రులు వీకే సింగ్, కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే మైక్ లో ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా.. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ప్రశాంత్ రెడ్డి ప్రసంగానికి అడుగునా అడ్డుతగిలారు.
గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ మధ్య పోరు వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై తప్పు మీదంటే మీదంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఆందోళనకు సైతం దిగారు. ప్రతి దాంట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ టీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల పెట్రోల్ ధరల పెరుగుదల విషయంలోనూ బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇలాంటి పరిస్థితి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం గందరగోళ పరిస్థితులకు దారితీసింది.
దాంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్పించుకున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలంటూ వారించారు. ఒకానొక దశలో కిషన్ రెడ్డి .. బీజేపీ కార్యక్రర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే నినాదాలు చేయడం ఆపాలన్నారు. అక్కడే ఉన్న గడ్కరీ సైతం బీజేపీ కార్యకర్తల తీరుతో కాస్త అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. దాంతో ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకు ముందు పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపనలు చేశారు. రెండు జాతీయ రహదారులు పూర్తికావడంతో జాతికి అంకితం చేశారు. దీంతో పాటు మరో ఏడు సీఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి శంకుస్థాపన చేశారు.
Also Read: Acharya Movie Review : ఆచార్య మూవీ రివ్యూ & రేటింగ్
Also Read: Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook