Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్​ సెన్​..!

Vishwak Sen Film: విశ్వక్​ సేన్ తాజా చిత్రం ఫస్ట్ సింగిల్​ రిలీజ్​ అయ్యింది. ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా అంటూ సాగుతున్న ఈ సాంగ్​ విశేషాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 09:18 PM IST
  • విశ్వక్​ సేన్​ కొత్త సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్​​
  • యూత్​కు ఆకట్టుకుంటున్న మెలోడి
  • ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా అంటూ సాగుతున్న సాంగ్​
Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్​ సెన్​..!

Vishwak Sen Film: యంగ్​ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఇటీవలే ఈ సినిమా టీజర్ (Vanamlo Arjuna Kalyanam Update)​ రిలీజ్ అవగా.. దానికి మంచి స్పందన వచ్చింది. ఇదే ఊపులో చిత్ర యూనిట్ మరో అప్​డేట్​ ఇచ్చింది.

ఈ సినిమాలోని ఓ మెలొడీ లిరికల్​ సాంగ్​ను గురువారం రిలీజ్​ చేసింది (Vishwak Sen new Film update) చిత్ర యూనిట్​. 'ఓ ఆడపిల్లా' అనే టైటిల్​తో ఈ సాంగ్​ను విడుదలైంది. యూట్యూబ్​ సహా దాదాపు అన్ని ఆడియో ప్లాట్​ఫామ్స్​లో అందుబాటులోకి వచ్చిన ఈ పాట.. యూత్​ను తెగ ఆకట్టుకుంటోంది.

సాంగ్​ గురించి..

'మాటరాని మాయవా.. మాయజేయు మాటవా.. మాటులోని మల్లెవా.. మల్లె మాటు ముల్లువా.. ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా..’ అంటూ సాంగ్ (Vanamlo Arjuna Kalyanam first single) సాగుతుంది.

ఈ సాంగ్​లో హీరో విశ్వక్​ సేన్​ 90లలో యువకుడిలా కనిపించారు. హీరోయిన్​ రుక్సార్​ ధిల్లాన్​ కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా కలిపించింది.

ఇక పాట బ్యాగ్రౌండ్​ను బట్టి చూస్తే.. ఓ మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ, లవ్​ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ఈ పాటను అనంత శ్రీరామ్​ రాయగా.. రామ్ మిరియాలా పాపడారు. జయ్​ క్రిష్ సంగీతమందించారు.

అశోకవనంలో అర్జున కళ్యాణం గురించి..

విశ్వక్​ సేన్​, రుక్సార్​ ధిల్లాన్​, రిథికా నాయక్​ ప్రధాన పాత్రలు పోషించారు. విధ్యాసాగర్​ చింతా దర్శకత్వం సినిమాకు దర్శకత్వం (Vanamlo Arjuna Kalyanam details) వహించారు. రవి కిరణ్ కోలా కథ అందించగా.. విప్లవ్ ఎడిటర్​గా పని చేశారు. ఎస్​వీసీసీ డిజిటల్​ బ్యానర్​పై బాపినీడు బీ, సుధీర్​ ఈదర నిర్మాతలు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఏప్రిల్​ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Also read: Hansika Motwani Photo: అందాల భామ హన్సిక ఏంటి ఇలా మారిపోయింది?

Also read: Dhanush Good Son In Law : ధనుష్‌పై పొగడ్తల వర్షం కురిపించిన రజనీకాంత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News