బీచ్‌లో కూడా చీర కట్టుకోవాలా: రాధికా ఆప్టే

నటి రాధికా ఆప్టే నెటిజన్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 

Last Updated : Mar 10, 2018, 06:16 PM IST
బీచ్‌లో కూడా చీర కట్టుకోవాలా: రాధికా ఆప్టే

నటి రాధికా ఆప్టే నెటిజన్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను బీచ్‌లో బికినీ ధరించి.. మద్యం సేవిస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాక.. అనేకమంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఆమెను తిట్టడం ప్రారంభించారు. భారతీయ కల్చర్ ఇలాంటి వారి వల్లే పాడవుతుందని తెలిపారు. అయితే.. అలాంటి మాటలకు రాధికా ఘాటుగానే జవాబిచ్చారు.

బీచ్‌లో కూడా తాను శారీ కట్టుకోవాలని కొందరు అనుకుంటున్నారని.. అయితే తన ఇష్టం తనదని ఆమె తెలిపారు. సోషల్ మీడియా ట్రాల్స్‌ని తాను పెద్దగా పట్టించుకోనని ఆమె చెప్పారు. 2016లో పర్చేడ్ అనే సినిమాలో నటించారు రాధికా ఆప్టే. అందులో ఆమె నటించిన నగ్న సన్నివేశాలు కొన్ని సినిమా విడుదల కాకముందే వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆ విషయంపై ఆమె పెద్దగా స్పందించలేదు. అలాంటి విషయాలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు ఆమె. 

 

 

#holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim

A post shared by Radhika (@radhikaofficial) on

Trending News