Marnus Labuschagne Slips And Loses His Wicket To Stuart Broad: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2021-22)లోని ఐదవ టెస్ట్ మ్యాచ్ హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య జరుగుతుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 303 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం ఆసీస్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచులో ఓ రెండు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలే తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్ (Joe Root)పై పడింది. అయితే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) వరుస బంతుల్లో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. 22వ ఓవర్ నాలుగో బంతికి మలన్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాతి బంతికి రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Captain gets captain!
Pat Cummins traps Joe Root lbw and the England skipper is gone! #Ashes pic.twitter.com/27jLfha9gK
— cricket.com.au (@cricketcomau) January 15, 2022
అద్భుతమైన బంతికి ఔట్ అయినట్లు తెలుసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూ కూడా తీసుకోకుండా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తన ట్విటర్లో పోస్ట్ చేసింది. 'కెప్టెన్‌ను ఔట్ చేసిన కెప్టెన్' (Captain Outs Captain) అని ఆ వీడియోకు సీఏ కాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సారథులు ఇద్దరు టాప్ ప్లేయర్స్ కావడం విశేషం. రూట్ 46 బంతుల్లో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు కమిన్స్ 4 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) బౌలింగ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లుబుషేన్ (Marnus Labuschagne) ఔటయ్యాడు. 23వ ఓవర్లోని ఓ బంతి బ్రాడ్ 134.1 వేంగంతో సంధించగా.. దాన్ని అడ్డుకోవడంలో విఫలమైన లుబుషేన్ బొక్కబోర్లాపడ్డాడు. బంతిని ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ వికెట్ ముందు బోర్లాపడ్డాడు. బంతి మాత్రం వికెట్లను ముద్దాడి బెయిల్స్‌ను పడేసింది. ఇంకేముంది కిందపడిన లుబుషేన్ లేచి పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబందించిన వీడియోను కూడా సీఏ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. వీడియో చూసిన ఫాన్స్ అందరూ నవ్వులు పూయిస్తున్నారు.
One of the weirdest dismissals we've ever seen! 😱#Ashes pic.twitter.com/8Qp5rKprn8
— cricket.com.au (@cricketcomau) January 14, 2022
Also Read: Anasuya Sankranthi Celebrations: అనసూయ సంక్రాంతి సంబరాలు.. పార్కులో భర్తతో కలిసి.. !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి