Job Mela: ఏపీలో జాబ్ మేళా-ఆ కంపెనీల్లో ఉద్యోగాలు-పూర్తి వివరాలివే...

Job Mela in Vizianagaram: ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18న విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఈ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 06:53 PM IST
  • విజయనగరంలో ఈ నెల 18న జాబ్ మేళా
  • జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
  • పాల్గొనున్న పలు ప్రైవేట్ కంపెనీలు
Job Mela: ఏపీలో జాబ్ మేళా-ఆ కంపెనీల్లో ఉద్యోగాలు-పూర్తి వివరాలివే...

Job Mela in Vizianagaram: ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18న విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఈ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, డీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో ఆయా కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవచ్చు. దాదాపు 600 పైచిలుకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలుస్తోంది.

జాబ్ మేళాలో మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహా పలు ఇతర కంపెనీలు పాల్గొనున్నాయి.

1. Mohan Spintex India Pvt Ltd, విజయవాడ : ఈ  కంపెనీలో 400 ట్రైనీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5వ తరగతి విద్యార్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాలు ఉండాలి. ఎంపికైన వారికి రూ.7930-రూ.10,000 ప్రారంభ వేతనం ఉంటుంది. 

2. Deccan Fine Chemicals, తుని: ఈ కంపెనీలో 200 ట్రైనీ కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ (సీబీజడ్), డిప్లొమా (మెకానికల్), బీటెక్ (మెకానికల్), బీఫార్మసీ, డీ ఫార్మసీ విద్యార్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎంపికైన వారికి రూ.15000 ప్రారంభ వేతనం ఉంటుంది.

3. Reliance Nippon Life Insurance, విజయనగరం: ఈ కంపెనీలో 20 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదేని డిగ్రీ అర్హతతో, 30 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రారంభ వేతనం రూ.12వేలు ఉంటుంది.

పైన పేర్కొన్న ఉద్యోగాలకు తగిన అర్హత కలిగిన ఔత్సాహిక అభ్యర్దులు జాబ్ మేళాలో (Andhra Pradesh) పాల్గొనవచ్చు. అంతకుముందు, www.ncs.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Rare Pregnancy Case: అత్యంత అరుదైన ప్రెగ్నెన్సీ కేసు... ఆ మహిళ కాలేయంలో పిండం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News