దళిత యువకులపై దాష్టికం... గుంజీలు తీయించి,నేలపై ఉమ్మి నాకించిన వైనం...

Two youth forced to lick spit: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇద్దరు దళిత యువకుల పట్ల బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. వారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 02:51 PM IST
  • బిహార్‌ ఔరంగాబాద్‌లో దళిత యువకులపై దాష్టికం
  • దళిత యువకులతో బలవంతంగా ఉమ్మి నాకించిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
 దళిత యువకులపై దాష్టికం... గుంజీలు తీయించి,నేలపై ఉమ్మి నాకించిన వైనం...

Two youth forced to lick spit: బిహార్‌లో (Bihar) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేసేందుకు నిరాకరించారన్న కారణంతో ఇద్దరు దళిత యువకులపై బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరితో గుంజీలు తీయించడంతో పాటు నేలపై ఉమ్మిని వారితో నాకించాడు. బిహార్‌లోని సింఘ్న గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

రెండు రోజుల క్రితం బిహార్‌లో తుది దశ పంచాయతీ ఎన్నికల (Bihar Panchayat Elections) పోలింగ్ జరిగింది. ఇందులో భాగంగా ఔరంగాబాద్‌ (Aurangabad) కుటుంబ బ్లాక్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో అనిల్ కుమార్, మంజీత్ కుమార్ అనే ఇద్దరు ఓటు వేయడానికి వెళ్లారు. ఈ ఇద్దరు మహా దళిత్ సామాజికవర్గానికి చెందినవారు. ఇద్దరు ఓటేయడానికి వెళ్తుండగా బలవంత్ సింగ్ అనే అభ్యర్థిని వీరిని అడ్డుకున్నాడు. ఆ ఇద్దరు తనకు ఓటు వేసేందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు.

ఇద్దరిని దూషిస్తూ వారితో గుంజీలు తీయించాడు. అక్కడితో సంతృప్తి చెందక నేలపై ఉమ్మి వేసి... దాన్ని ఆ ఇద్దరితో నాకించాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో స్థానిక (Bihar) పోలీసులు బల్వంత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. బాధిత వ్యక్తులు బల్వంత్ సింగ్‌పై ఫిర్యాదు చేశారని... ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కంటేష్ మిశ్రా వెల్లడించారు. త్వరలోనే ఇద్దరిపై చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. దళితుల పట్ల ఇలాంటి అమానవీయ ఘటనలు, దాష్టికాలు గతంలోనూ చాలానే వెలుగుచూశాయి.

Also Read: Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News