Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బీరాపేరు వాగుపై ఉన్న వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ (Lorry hits Auto) ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోగా... ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు రక్షించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒక బాలిక మృతి చెందింది. గల్లంతైనవారి కోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరుకు (Athamkuru) చెందిన ఓ కుటుంబం గురువారం (డిసెంబర్ 9) సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు ఓ ఆటోలో బయలుదేరారు. మొత్తం 12 మందితో బయలుదేరిన ఆ ఆటో బీరాపేరు వాగుపై ఉన్న వంతెనపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో వాగులో పడిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల (Nellore) సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని రక్షించగలిగారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలవడంతో వీరిలో ఒక బాలిక మృతి చెందింది. మరో ఐదుగురు వాగులో గల్లంతవగా ప్రస్తుతం వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాత్రి పూట జరిగిన ప్రమాదం (Road Accident) కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామని... ఇందుకోసం బోట్లు తెప్పిస్తున్నామని తెలిపారు.
విజయనగరంలో ట్రాక్టర్ బోల్తా:
విజయనగరం (Vizianagaram) జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కిండాం అగ్రహారంలో వివాహ వేడుకకు హాజరై తిరిగొస్తుండగా ఈ ప్రమాదం (Road Accident) జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 35 మంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Ganguly on Kohli Captaincy: కెప్టెన్ గా కోహ్లీని అందుకే తొలగించాం: గంగూలీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook