Allahabad HC to Yes Bank: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుదెబ్బ

Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ (DishTv Shares freezing issue) వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Nov 27, 2021, 09:49 PM IST
  • అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంకుకు చేదు అనుభవం
  • యస్ బ్యాంకు వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించిన Allahabad High court
  • అలహాబాద్ హై కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన YES bank
  • DishTv Shares freezing వ్యవహారంలో హై కోర్టు కీలక వ్యాఖ్యలు
Allahabad HC to Yes Bank: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుదెబ్బ

Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ వ్యవహారంలో (DishTv Shares freezing issue) ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డా సుభాష్ చంద్ర ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా కోరుతూ యస్ బ్యాంక్ అలహాబాద్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ తాజాగా విచారణకొచ్చింది. ఈ సందర్భంగా యస్ బ్యాంకుపై అక్షింతలు వేసిన అలహాబాద్ హై కోర్టు.. ఈ కేసు విచారణలో తాము కలగజేసుకోలేమని తేల్చిచెప్పింది.

అలహాబాద్ హై కోర్టు ఆదేశాలతో యస్ బ్యాంకుకు చేదు అనుభవం (Big embarrassment to YES bank) ఎదురైంది. ఈ కేసులో యస్ బ్యాంకును నిందితులుగానే చూపనప్పుడు.. ఇక బ్యాంకుకు వచ్చిన అభ్యంతరాలు ఏముంటాయని అలహాబాద్ హై కోర్టు ప్రశ్నించింది. హై కోర్టు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం యస్ బ్యాంకు వంతయ్యింది.

Also read : SBI: ఎస్​బీఐకి షాక్​- రూ.కోటి జరిమానా విధించిన ఆర్​బీఐ

YES bank వద్ద సమాధానం లేని ప్రశ్నలు:
> డిష్ టీవీ షేర్స్‌ని (Dish TV shares) గుప్పిట్లో పట్టుకుని జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఓటింగ్‌కి వెళ్లాలని తొందరపడటంలో యస్ బ్యాంకు ఆంతర్యం ఏంటి ?

> యస్ బ్యాంకు (YES banks's conspiracy) తమ రుణాలను రికవరి చేసుకోవాలని భావిస్తోందా ? లేక ఇచ్చిన రుణాలను సాకుగా చూపి అక్రమ మార్గంలో కంపెనీపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తోందా ?

> యస్ బ్యాంకు యాజమాన్యానికి బ్యాంకు కార్యకలాపాలు నిర్వర్తించడంలో నైపుణ్యం ఉందా ? లేక మీడియా కంపెనీని నిర్వహించడంలో నైపుణ్యం ఉందా ?

> వేరెవరో వ్యక్తుల కోసం డిష్ టీవీ కంపెనీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని యస్ బ్యాంకు కుట్రపన్నుతోందా ?

> ఒక బడా కార్పొరేట్ కంపెనీకి యస్ బ్యాంకు (YES bank disputes) ఏజెంటుగా వ్యవహరిస్తోందా ?

> డిష్ టీవీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (Dish TV's AGM) యస్ బ్యాంకు ఎన్నిసార్లు ఓటింగులో పాల్గొంది ?

> ఏ అవసరం లేకుండానే యస్ బ్యాంకు హై కోర్టు చుట్టూ, సుప్రీం కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందా ?

Also read : Bank Holidays in December 2022 : డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు, పని దినాల వివరాలు

హై కోర్టు అడిగిన పై ప్రశ్నలకు యస్ బ్యాంకు సమాధానం చెప్పలేకపోయింది. డా సుభాష్ చంద్ర (Dr. Subhash Chandra) ఇచ్చిన ఫిర్యాదును ఒకసారి పరిశీలిస్తే.. యస్ బ్యాంకు మాజీ సీఈఓ, చైర్మన్ అయిన రానా కపూర్, వీడియోకాన్ గ్రూప్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వేణుగోపాల్ దూత్, ఇతరులు కలిసి డిష్ టీవీని వీడీయోకాన్‌ కంపెనీకి చెందిన D2H కంపెనీతో విలీనం చేసేందుకు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని సుభాష్ చంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రానా కపూర్ ఈ ప్రతిపాదన తీసుకురావడం వెనుక అతడి సొంత ప్రయోజనాలు ఉన్నాయని సుభాష్ చంద్ర స్పష్టంచేశారు. 

డిష్ టీవీ వీడియోకాన్‌లో (Videocon's D2H) విలినమైన అనంతరం అదే విలీనం కంపెనీని యస్ బ్యాంకుకు బదిలీ చేయించుకోవచ్చనేది రానా కపూర్ కుట్రగా సుభాష్ చంద్ర అభివర్ణించారు. వీడియోకాన్‌కి యస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో.. వీడియోకాన్ వైఫల్యాన్ని వాడుకుని ఈ డీల్‌ పూర్తి చేయాలని రానా కపూర్ (YES bank's Rana Kapoor) కుట్ర చేసినట్టు సుభాష్ చంద్ర ఆరోపించారు.

Also read : Airtel latest prepaid tariffs : ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్ టెల్.. ధరల వివరాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News