Covaxin Vaccine For Children: అమెరికాలోని పిల్లలకు 'కొవాగ్జిన్' టీకా (Covaxin) ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) కోరుతూ అమెరికాలోని భారత్ బయోటెక్ (Bharat biotech) వ్యాపార భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్ ఇంక్ దరఖాస్తు (covaxin ocugen) చేసింది. 2- 18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా ఇవ్వటానికి వీలుగా అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి కోరుతూ దరఖాస్తు దాఖలు చేసినట్లు ఆక్యుజెన్ ఇంక్ తాజాగా వెల్లడించింది.
భారత్‌లో దాదాపు 526 మంది పిల్లలపై ఈ టీకా (Corona vaccine) ఎలా పనిచేస్తుందనే విషయమై నిర్వహించిన 2-3 దశల క్లినికల్ పరీక్షల సమాచారం ఆధారంగా ఈ దరఖాస్తు చేసినట్లు ఆక్యుజెన్ ఇంక్. పేర్కొంది. దీన్ని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదిస్తే, అమెరికాలో పిల్లలకు అందుబాటులోకి వచ్చిన కొవిడ్-19 రెండో టీకా కొవాగ్జిన్ అవుతుంది.
'కొవాగ్జిన్'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగ గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంతో పాటు వివిధ దేశాల్లో 10 కోట్ల డోసులకు పైగా 'కొవాగ్జిన్' టీకా ఇచ్చారు.
Also Read: Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది
Also Read: China Lockdown: 'నిత్యవసరాలు స్టాక్ పెట్టుకోండి' - ప్రజలకు చైనా ప్రభుత్వం హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి