DCGI Grants Permission To Covid Vaccines: భారతదేశంలో తయారైన కరోనా టీకాలైన కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి లభించింది. కొన్ని షరతులతో ఈ రెండు టీకాలను మార్కెట్లో విక్రయించుకునేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ పేర్కొంది.
Vaccination of children: దేశవ్యాప్తంగా పిల్లల వ్యాక్సినేషన్‌కు భారీగా స్పందన లభిస్తోంది. 15-18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మాత్రమే ఇస్తున్నారు వైద్య సిబ్బంది.
Covaxin: ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో భారీగా ఎగుమతుల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపింది.
Covaxin Vaccine For Children: 18 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా (Covaxin) ఇచ్చేందుకు అమెరికా ఔషధ నియంత్రణ మండలి- ఎఫ్‌డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినట్లు భారత్ బయోటెక్ భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్ ఇంక్ వెల్లడించింది (covaxin ocugen). భారత్‌లో నిర్వహించిన 2-3 దశల క్లినికల్ పరీక్షల సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసినట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తం కరోనా మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కరోనా బారి నుంచి కోలుకున్నా, దాని వల్ల కలిగిన దుష్పరిణామాల కారణంగా చనిపోయారు. ఆరోగ్య, పారిశుద్ధ కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ త్యాగాల ఫలితంగా భారత్‌లోనూ 95 శాతం మంది కోవిడ్-19 మహమ్మారిని జయించారు.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో కీలక అడుగు పడనుంది. జనవరి 16న భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ప్రారంభిస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అత్యవసర వినియోగం నిమిత్తం భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనుమతి పొందడం తెలిసిందే.
Covaxin Only For Those Above 18 Years, Not For Children: భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్. జనవరి 16 నుంచి ఈ కోవాగ్జిన్ టీకాలు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.