Dubai Expo Opens: ప్రపంచ అద్భుతాల వేదిక దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభం

Dubai Expo Opens: ప్రపంచ ప్రసిద్ధ అద్భుతాలకు వేదికగా మారిన , చర్చనీయాంశమైన దుబాయ్ ఎక్స్‌పో 2020 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మధ్య ప్రాచ్యంలో ఏర్పైటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఇదే కావడం విశేషం. ఈ ఎక్స్‌పో ప్రత్యేకతలేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2021, 11:20 AM IST
  • దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎక్స్‌పో 2020
  • ఆరు నెలలపాటు సాగనున్న మిడ్‌ఈస్ట్‌కు చెందిన తొలి వరల్డ్ ఎక్స్‌పో
  • ప్రపంచంలోని 192 దేశాల ప్రాతినిధ్యం, అద్భుతాలు, ఆవిష్కరణల వేదికగా మారిన దుబాయ్ ఎక్స్‌పో
Dubai Expo Opens: ప్రపంచ అద్భుతాల వేదిక దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభం

Dubai Expo Opens: ప్రపంచ ప్రసిద్ధ అద్భుతాలకు వేదికగా మారిన , చర్చనీయాంశమైన దుబాయ్ ఎక్స్‌పో 2020 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మధ్య ప్రాచ్యంలో ఏర్పైటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఇదే కావడం విశేషం. ఈ ఎక్స్‌పో ప్రత్యేకతలేంటో చూద్దాం.

ఎనిమిదేళ్లపాటు కోట్లాది రూపాయల ఖర్చు, అద్భుతమైన ప్రణాళిక వెరసి మధ్య ప్రాచ్యంలోని తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌కు వేదికగా మారింది. 8 ఏళ్ల క్రితం వరకూ అంతా ఎడారి ప్రాంతం. అసలీ ఎడారి ప్రాంతంలో ఇంత అద్భుతమైన ఎక్స్‌పో ఎలా అనేదే ఆసక్తి కల్గించే అంశమైందిప్పుడు. ప్రపంచం నలుమూలల్నించి ఉన్న అద్భుతాలు, ఆవిష్కరణల నమూనాలకు వేదికగా మారింది. కన్నులవిందుగా ఉంది. మొత్తం 190 దేశాలకు సంబంధించిన విభాగాలు ఈ ఎక్స్‌పోలో ఉన్నాయి. 

ఎక్స్‌పో 2020 గానే (Dubai Expo 2020)ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. వాస్తవానికి గత ఏడాది ప్రారంభం కావల్సిన ఎక్స్‌పో..కరోనా సంక్షోభం(Corona Crisis)కారణంగా వాయిదా పడింది. ఆరు నెలల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ ఎంతమంది విదేశీయుల్ని ఆకర్షిస్తుందనేది చూడాలి. మొత్తం 1080 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్ మధ్యప్రాచ్యంలో(World First Expo from Mideast) ఓ అద్భుతంగా నిలుస్తోంది.192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, అమెరికా మూడవ అధ్యక్షుడు వాడిన పవిత్ర ఖురాన్, టాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల పొడవైన ఇటలీ తాడు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ వంటివి ప్రదాన ఆకర్షణలుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో చూడనున్న ప్రోటో‌టైప్‌లు కూడా ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. ఈ తరహా ఇంతటి భారీ ఎగ్జిబిషన్ ను ఇప్పటి వరకూ అమెరికా, యూరోప్ మినహా మరెక్కా నిర్వహించలేదు. ఆఫ్రికన్ ఫుడ్ హాల్, ఈజిప్షియన్ మమ్మీ కూడా విశేషంగా ఆకర్షించనున్నాయి.

1851లో తొలిసారిగా లండన్‌లో(London) ప్రారంభమైన ఈ విధమైన ఎగ్జిబిషన్‌లు(World Fair Expo) ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ప్రతినిధుల కలయిక, అభిప్రాయాలు పంచుకోవడం, ఆవిష్కరణల ప్రదర్శన, సంస్కృతి, వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు దోహదపడుతున్నాయి. దాదాపు శతాబ్దకాలంగా ఈ ఎగ్జిబిషన్‌లు మనిషి అద్భుత ఆవిష్కరణలు, ఆలోచనలు, ఊహాజనిత అంశాలకు వేదికగా మారాయి. 1876లో తొలిసారిగా అమెరికాలో(America) జరిగిన మొదటి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో అలెగ్జాండర్ గ్రాహంబెల్‌కు చెందిన టెలిపోన్, టైప్ రైటర్,  మెకానికల్ క్యాలిక్యులేటర్‌లను ప్రదర్శించారు. అప్పట్లో 10 మిలియన్ల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌కు వచ్చినట్టు అంచనా.

Also read: India Hits Back At China: చైనా ఆరోపణలను తిప్పికొట్టిన భారత్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న చైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News