Vizag Steel Plant Issue: అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా తొలగిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం

Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్డులో ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 28, 2021, 01:48 PM IST
Vizag Steel Plant Issue: అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా తొలగిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం

Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్డులో ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. 

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌(Visakha steel plant)ను ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు మద్దతిస్తోంది. ఇందులో భాగంగా మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరకేంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారిస్తున్న హైకోర్టు..అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని(Central government) ఆదేశించింది.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏపీ హైకోర్టు(Ap High Court)లో తన అఫిడవిట్ సమర్పించింది. పలు అంశాల్ని ఇందులో ఉదహరించింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని..అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగిస్తామని తెలిపింది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను(Visakha steel plant privatisation)వ్యతిరేకించడం మంచిది కాదని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని..వందశాతం ప్రైవేటీకరణ చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని చెప్పింది. ఈ కేసులో పిటీషన్ దాఖలు చేసిన జేడీ లక్ష్మీనారాయణ..విశాఖ ఎన్నికల్లో పోటీ చేశారని హైకోర్టుకు గుర్తు చేసింది. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఆయన పిటీషన్ దాఖలు చేశారని..పిటీషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

Also read: AP Government: ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News