India Corona Cases Today: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 102 రోజుల తరువాత తొలిసారి

India reports decline in corona cases today: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. అమెరికాను వెనక్కి నెట్టి అత్యధిక డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చిన దేశంగా భారత్ తొలి స్థానానికి చేరింది. భారత్‌తో పోల్చితే నెల రోజుల ముందుగానే అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2021, 10:16 AM IST
India Corona Cases Today: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 102 రోజుల తరువాత తొలిసారి

India reports decline in corona cases today: ఇండియాలో కోవిడ్19 కొత్త వేరియంట్ కేసులు పుట్టుకొస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి.  భారత్‌లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 37,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల తరువాత దేశంలో 40 వేల దిగువన కరోనా కేసులు వచ్చాయి.

తాజా కేసులతో కలిపితే దేశంలోని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,03,16,897కు (30 కోట్ల 3 లక్షల 16 వేల 897)కు చేరుకుంది. మరోవైపు నిన్నటితో పోల్చితే కోవిడ్19 మరణాలు సైతం తగ్గాయి. వరుసగా రెండోరోజు వెయ్యి దిగువన కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 907 మంది చనిపోగా, దేశంలో సంభవించిన మొత్తం కోవిడ్19 మరణాలు 3,97,637 (3 లక్షల 97 వేల 637)కి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజు వ్యవధిలో 56,994 మంది కరోనా మహమ్మారిని జయించగా, ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,93,66,601 (2 కోట్ల 93 లక్షల 66 వేల 601)కు చేరుకుంది. 

Also Read: Delta Plus Variant of Covid-19: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, అవన్నీ అపోహలే: నిపుణులు

దేశంలో యాక్టివ్ కేసులు ఐదున్నర లక్షలకు దిగొచ్చాయి. మంగళవారం (జూన్ 29) ఉదయం నాటికి దేశంలో 5,52,659 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. మరోవైపు ఇండియాలో కరోనా రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. అమెరికాను వెనక్కి నెట్టి అత్యధిక డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చిన దేశంగా భారత్ తొలి స్థానానికి చేరింది. భారత్‌తో పోల్చితే నెల రోజుల ముందుగానే అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

Also Read: Also Read: Benefits Of Carrots: కోవిడ్19 సమయంలో క్యారెట్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News