Dubai Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భారత విమానాలపై ఉన్న ఆంక్షల్ని దుబాయ్ ప్రభుత్వం తొలగించింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయున్నాయి. భారత విమానాలపై వివిధ దేశాలు నిషేధం విధించాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇండియా సహా ఇతర దేశాల్నించి వచ్చే ప్రయాణాలపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 23 నుంచి విమాన సర్వీసుల్ని నడపాలని దుబాయ్ ఎమిరేట్స్(Dubai Emirates) నిర్ణయం తీసుకుంది.
మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల్నించి దుబాయ్ వచ్చే ప్రయాణీకుల్ని తిరిగి అనుమతించేందుకు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించిన తాజా ప్రోటోకాల్స్‌ను ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.
Also read: Third Wave Fear: డెల్టా వేరియంట్‌తో బ్రిటన్‌లో థర్డ్‌వేవ్ ముప్పు, లాక్‌డౌన్ తొలగిస్తారా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook