భారత్‌లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. కానీ కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులో ఓవైపు తగ్గుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ సమస్య సవాల్‌గా మారుతుంది. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు 4 వేలకు పైగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దేశంలో కరోనా మరణాలు 3 లక్షలు దాటిపోయాయి.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,22,315 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,67,52,447 (2 కోట్ల 67 లక్షల 52 వేల 4 వందల 47)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,454 మంది కోవిడ్19 బారిన పడి చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3,03,720కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు
దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,02,544 (3 లక్షల 2 వేల 5 వందల 44) మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,37,28,011 (2 కోట్ల 37 లక్షల 28 వేల 011)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 27,20,720 (30 లక్షల 27 వేల 925 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 19 కోట్ల 60 లక్షల 51 వేల 962 మందికి టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook