Lockdown: దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా..ఇప్పుడు కొత్తగా వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.
దేశం రాజధానిలో కరోనా వైరస్(Corona virus)తీవ్రంగా ప్రబలుతోంది. అత్యధికంగా ఒక్కరోజులో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమల్లో ఉంది. ఢిల్లీలో గత 24 గంటల్లో అత్యధికంగా 25 వేల కేసులు నమోదవడంతో ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమీక్షించారు. ఈ నెల 26వ తేదీ వరకూ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్ ( Lockdown in Delhi) విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సహాకారంతో మహమ్మారిని ఎదుర్కొంటామని...లాక్‌డౌన్ పొడిగించే పరిస్థితి రాదని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో నాలుగో వేవ్ కొనసాగుతోందని, పాజిటివ్ రేటు పెరిగిందని ఆందోళన అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలతో అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఐసీయూ బెడ్స్ నిండిపోయాయని..ఆక్సిజన్ కొరత ( Oxygen shortage) వేధిస్తోందని తెలిపారు. దీనికి తోడు రోజులు 25వేలకు పైగా కేసులు రావడంతో చికిత్స అందించడం కష్టంగా మారిందన్నారు. రోజువారీ కరోనా కేసులు, మరణాల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధానిలో 7 రోజుల పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. కష్టమైనా లాక్‌డౌన్ తప్పలేదని, కానీ వలస కార‍్మికులు ఇక్కడే ఉండాలని సూచించారు. ఇది చిన్న లాక్‌డౌన్ మాత్రమే..దయచేసి ఎక‍్కడికీ వెళ్లకండి..ఆందోళన చెందకండి.. ప్రభుత్వం మిమ్మల్నిఆదుకుంటుంది అంటూ జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. అయితే అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అన్ని ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం పనిచేయనున్నారు. అయితే, అవసరమైన సేవలకు పరిమితుల నుండి మినహాయింపు ఉండనుంది.
Also read: India Corona update: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 2 లక్షల 73 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Lockdown: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్