Curry leaves tea: దక్షిణ భారత వంటల్లో ముఖ్యంగా తెలుగింటి కూరల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే కేవలం కూరల్లోనే కాదు టీ రూపంలో కూడా కరివేపాకు ఉపయోగిస్తారనేది మీకు తెలుసా. అసలు కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా.
అద్భుతమైన సువాసన, రుచి కరివేపాకు సొంతం. అందుకే తెలుగింటి కూరల్లో కరివేపాకు లేకుండా ఏ కూర కూడా ఉండదంటే ఆశ్చర్యం లేదు. కూరల్లో తాలింపుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకును పొడిగా చేసుకుని నెయ్యితో కలుపుకుని అన్నం తింటే ఆ రుచే వేరు. లేదా కరివేపాకు (Curry leaves)పచ్చడి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇదే కాకుండా కరివేపాకును టీ రూపంలో కూడా ఇస్తుంటారు. ప్రతిరోజూ కరివేపాకు టీ తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అసలా ప్రయోజనాల గురించి తెలిస్తే..మీరు కూడా మీ దినచర్యలో కరివేపాకు టీని భాగంగా చేసుకుంటారు.
కరివేపాకు టీ ( Curry leaves tea)ఎలా చేయాలి
కొన్ని కరివేపాకులు తీసుకుని శుభ్రంగా కడగండి. తరువాత ఓ గిన్నెలో నీరు తీసుకుని బాగా వేడి చేయండి. స్టౌ ఆర్పేసి ఆ మరిగించిన నీటిలో కరివేపాకు ఆకుల్ని వేయండి. నెమ్మదిగా నీటి రంగు మారుతుంది. తరువాత నీటిని కప్పులోకి ఫిల్టర్ చేసి..తేనె , బెల్లం కలిపి తాగితే రుచికి రుచి ఉంటుంది . ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది. అదే నల్లబెల్లం కలిపి తాగితే ఇంకా మంచిది. అదే నీటిలో తేనె, నిమ్మరసం కూడా కలిపి సేవించవచ్చు.
కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు ( Curry leaves tea benefits)
కరివేపాకు టీ తాగడం వల్ల మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల సమస్య నయమవుతుంది. కరివేపాకుల్లో తేలికపాటి భేదిమందు లక్షణాలతో పాటు జీర్ణ ఎంజైములుంటాయి ఇవి మీ శరీరంలోని ప్రేగు కదలికల్ని మెరుగుపర్చడంతో జీర్ణ ప్రక్రియ ( Digestion) మెరుగవుతుంది. కరివేపాకు టీ తాగడం వల్ల కడుపులోని సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో ఉండే అరోమా..నరాల్ని రిలాక్స్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. సో..రోజంతా అలసిపోయినవారు కరివేపాకు టీ తీసుకుంటే వెంటనే రిలాక్స్ అవుతారు.
ఇక మధుమేహం ( Diabetes) సమస్య ఉన్నవారికి కరివేపాకు టీ ఓ దివ్యమైన ఔషధమే. మన శరీరంలోని సుగర్ లెవెల్స్‌ను పెంచకుండా నియంత్రిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కరివేపాకు టీ చాలా మంచిది. నీరసం, వికారం వంటి సమస్యల్నించి తక్షణం ఉపశమనం లభిస్తుంది. ఇక విరేచనాలతో బాధపడుతున్నా సరే కరివేపాకు టీ బెస్ట్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. ఇక అన్నింటికీ మించి కరివేపాకు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ( Anti oxidant) అని చాలా మందికి తెలియదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనోలిక్స్ కారణంగా చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ అంతమవుతాయి. ఆరోగ్యంగా ఉంటుంది చర్మం. చర్మంపై మంట లేదా ఇన్ఫెక్షన్ రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది.
కరివేపాకు ఆకులే కాదు కరివేపాకు కాయలు, వేరుపై బెరడు, కాండంపై బెరడు అన్నింటినీ వివిధ రకాల ఔషధాల్లో ఆయుర్వేద వైద్యులు వాడుతుంటారు అందుకే. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరివేపాకు ఒక మంచి మెడిసిన్.
Also read: Vitamin C: ఉసిరి కల్గించే లాభాలెన్నో తెలుసా..ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook