Telangana Govt Jobs: తెలంగాణలో 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, PRC Reportలో ఊహించని వివరాలు

Job Vacancies In Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండగా, మరోవైపు నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల్లో ఖాళీలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 30 శాతం ఖాళీలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 28, 2021, 04:05 PM IST
  • వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పలు కీలక అంశాలు
  • రాష్ట్రంలో మొత్తం 4,91,304 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా
  • కేవలం 3,00,178 మంది ఉద్యోగాలు చేస్తున్నారని పీఆర్‌సీ నివేదికలో తెలిపింది
Telangana Govt Jobs: తెలంగాణలో 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, PRC Reportలో ఊహించని వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకు భారీగా ఫిట్‌మెంట్, పదవీ విరమణ వయసు పెంపు లాంటి పలు కీలక నిర్ణయాలతో తమకు లాభం చేకూరుతుందని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ నివేదిక బయటకు రావడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో అసలు తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై చర్చ మొదలైంది.

వేతన సవరణ సంఘం(PRC Peport Latest Updates) ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పలు కీలక అంశాలు దాగున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలపై నివేదికల పలు విషయాలు తేల్చింది. ప్రస్తుతం 39 శాతం ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని సమాచారం. రాష్ట్రంలో మొత్తం 4,91,304 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా.. కేవలం 3,00,178 మంది ఉద్యోగాలు చేస్తున్నారని పీఆర్‌సీ తమ నివేదికలో తెలిపింది.

Also Read: India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు

తెలంగాణలో ఏకంగా 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలు(Telangana Govt Jobs) ఖాళీగా ఉన్నాయని స్పష్టమైంది. దాదాపు 40 శాతం మేర ప్రభుత్వ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదని తెలుస్తోంది. శాఖలవారీగా సైతం ఆయా ఖాళీల వివరాలను నివేదికలో పొందుపరిచింది. ప్రతి వెయ్యి మందికి 14 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం 9 మందిలోపే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే

శాఖలు, కేటాయించిన పోస్టులు, ప్రస్తుతం ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి..
పాఠశాల విద్యాశాఖ - మంజూరైన మొత్తం పోస్టులు 1,37,851,  పనిచేస్తున్న ఉద్యోగులు 1,13,853 

పోలీసు శాఖ - మంజూరైన మొత్తం పోస్టులు 98,394,  పనిచేస్తున్న ఉద్యోగులు 61,212

ఆరోగ్య శాఖ - మంజూరైన మొత్తం పోస్టులు 52,906,  పనిచేస్తున్న ఉద్యోగులు 22,336

రెవెన్యూ శాఖ  - మంజూరైన మొత్తం పోస్టులు 27,786,  పనిచేస్తున్న ఉద్యోగులు 19,825

పంచాయతీ రాజ్ - మంజూరైన మొత్తం పోస్టులు 26,201,  పనిచేస్తున్న ఉద్యోగులు 13,573

వీటితో పాటు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 58,128 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్‌ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్

తెలంగాణలో దాదాపు 2 లక్షల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం తెలిసిందే. జారీ చేసిన పోస్టులలోనూ గరిష్టంగా 20 వేల వరకు పోలీసు శాఖలోనే ఉద్యోగులు భర్తీ చేయనున్నారు. అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News