న్యూఢిల్లీ (పిటిఐ): పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాది నూర్ మొహమ్మద్ తంత్రాయ్ భారతీయ జనతా పార్టీలో చేరాలని, పార్టీలోని పలు సీనియర్ సభ్యులను చంపాలని కోరుకున్నారు.
"మర్చెంట్ ఆఫ్ డెత్" అని కూడా పిలవబడే తంత్రాయ , 2003లో బీజేపీలో చేరాలని అనుకున్నారని డిఎన్ఏ నివేదించింది. తంత్రాయ్ ఎత్తు నాలుగు అడుగులు. చూస్తే ఇతన్ని ఎవ్వరూ ఉగ్రవాది అనుకోరు.
జైషే మహ్మద్ (జేఎం) తీవ్రవాది న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించాడు. ఒక మంచి వ్యక్తిగా ఉంటూ పార్టీలో సభ్యత్వం నమోదుచేసుకోవాలని అనుకున్నాడు. గూడాచార్యం, ఆతరువాత బీజేపీ నాయకులపై దాడి అని ప్రణాళిక రచించాడు.
అయితే, ప్రణాళిక అమలులోనికి రావడానికి ముందు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యొక్క యాంటీ-టెర్రర్ యూనిట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ చంద్ నేతృత్వంలోని బృందం, అతన్ని, అతని సహచరులను ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కలిగిఉన్నాడని పోటా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ నాలుగు అడుగుల పొడవైన తీవ్రవాది పీర్ బాబా, గుల్జార్ అహ్మద్ భట్, ఉవాయిస్ మొదలైన పలు పేర్లతో వివిధ ప్రదేశాల్లో పర్యటించాడు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించిన ఒక ఉగ్రవాద సంస్థగా జేఎంను గుర్తించిన నేపథ్యంలో, మంగళవారం జమ్మూకాశ్మీర్ పోలీస్ ప్రత్యేక విభాగం, డివిజనల్ కమాండర్ తంత్రాయ్ ను హతమార్చింది. పెరోల్ పై బయట పడిన తంత్రాయ్ దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో తుపాకీ కాల్పుల్లో మరణించాడు. డిసెంబరు 25-26 మధ్యకాలంలో పుల్వామాలోని సంబూరోలో చనిపోయాడు.
2003లో అరెస్టు అయిన తరువాత, తంత్రాయ్ ఢిల్లీ తీహార్ జైలులో సుమారు ఎనిమిది సంవత్సరాలు గడిపాడు. తరువాత 2015లో పెరోల్ మీద విడుదలై, తన కార్యకలాపాలను తీవ్రతరం చేశారని డిఎన్ఏ నివేదించింది.