కరోనా వైరస్ ( Coronavirus ) సంక్రమణ నేపధ్యంలో ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి భయపడుతున్నారా? కోవిడ్ సంక్రమణ లేదా క్వారెంటైన్ భయం ( Quarantine Fear ) ఉందా? అయితే మీ కోసం ప్రత్యామ్నాయం వస్తోంది. అదే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న కోవిడ్ passport .
కరోనా వైరస్ భయం నేపధ్యంలో దేశీయంగా ప్రయాణాలు చేయడానికే భయపడిపోతున్నారు. అటువంటిది అంతర్జాతీయ ప్రయాణాల పరిస్థితి మరీనూ. ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లేందుకు విమాన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కరోనా వైరస్ సంక్రమణ భయం..మరోవైపు క్వారెంటైన్ భయం. కనీసం పది నుంచి పదిహేను రోజులు స్వీయ నిర్బంధంలో ఉండిపోవల్సి వస్తుంది. అందుకే పరిష్కారమార్గంగా క్యాథె పసిఫిక్ ఎయిర్ లైన్స్ ( Cathay airlines )..యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ( United airlines ) కలిసి సంయుక్తంగా ఓ ఉపాయాన్ని కనుగొన్నాయి.
ఈ రెండు ఎయిర్ లైన్స్ కలిసి కామన్ పాస్ ( Common pass app ) పేరుతో ఓ యాప్ అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి ముందు ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు ( Covid19 Test ) చేయించుకుని ఆ వివరాల్ని ఈ యాప్ ద్వారా స్టోర్ చేసుకోవాలి. ఇక ఏ విమానాశ్రయంలోనైనా సంబంధిత అధికారులు అడిగినప్పుడు మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను ఓపెన్‌చేసి చూపిస్తే సరిపోతుంది. ఈ సరికొత్త ప్రయోగాన్ని ఈ వారం నుంచి హీత్రూ విమానాశ్రయంలో పరిశీలించనున్నారు. ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రభుత్వాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కామన్స్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వివిధ భాషల్లో ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌కు ఉండే క్యూఆర్ కోడ్‌ను విమానాశ్రయ సిబ్బంది, సరిహద్దు భద్రతా సిబ్బంది స్కాన్ చేస్తే వివరాలు తెలుస్తాయి.
హీత్రూ విమానాశ్రయం ( Heathrow Airport ) లో ఈ ప్రయోగం సఫలమైతే..క్రమంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలు స్పందన వంటి యాప్ ల ద్వారా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రవేశపెట్టిన పాస్ లకు ఇది కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్. Also read: Kerala Gold Scam: చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ