పాట్నా: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు. రాజధాని పాట్నాలో గురువారం ఉదయం బీజేపీ నేత రాజేష్ ఝాను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
నేటి ఉదయం పాట్నాలో మార్నింగ్ వాక్‌కు బయటకు వెళ్లిన నేత రాజేష్ ఝాను ఇంటికి తిరిగిరాలేదు. రాజేష్‌ను బైకు ఫాలో అయిన ఇద్దరు దుండగులు ఒక్కసారి నేతను అడ్డుకుని కొన్ని రౌండ్లపాటు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిడక్కడే మరణించినట్లు సమాచారం. కాగా, కొన్ని రోజుల కిందటే రాజేష్ ఝా బీజేపీలో చేరడం తెలిసిందే. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుంది.
Bihar: A local BJP leader Rajesh Jha, who recently joined the party, was shot dead by 2 bike-borne men today in Patna. He was out for morning walk when incident took place. His brother-in-law (pic 2) says "I think he was on someone's target, looks like a case of personal enmity." pic.twitter.com/59DaCUc2eF
— ANI (@ANI) October 1, 2020
రాజేష్ ఝా సమీప బంధువు, ఆయన బావ ఘటనపై స్పందించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేసి ఉంటారు. కొన్ని రోజుల నుంచి రాజేష్ వారి టార్గెట్‌గా మారి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యక్తిగత కారణాలతో హత్య జరిగి ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేత రాజేష్ ఝా హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Robin Uthappa: విరాట్ కోహ్లీ చెత్త రికార్డును అధిగమించిన రాబిన్ ఉతప్ప
మరిన్ని కథనాలు మీకోసం
- Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
- Health Tips: ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe