జమ్మూకాశ్మీర్ ( Jammu kashmir ) పాలనా యంత్రాంగంపై సుప్రీంకోర్టు ( Supreme court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెంతకాలం నిర్బంధంలో ఉంచుతారని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ( Jammu kashmir Ex cm mehbooba mufti ) అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెను ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏ ఆదేశం ప్రకారం, ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారంటూ సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి...కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించగా...దీనికి కొంత సమయం ఇవ్వాలని.. వారం రోజుల లోపు దీనిపై వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు రెండు వారాల గడువిచ్చింది.మరోవైపు మెహబూబా ముఫ్తీ కుమార్తె, కుమారుడు ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ( jammu kashmir special status ) కల్పించే ఆర్టికల్ 370 ( Article 370 abolition ) ని కేంద్ర ప్రభుత్వం ( Central government ) గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. దాదాపు ఏడాది నిర్భంధం అనంతరం కోర్టు జోక్యంతోనే ఫరూక్ అబ్దుల్లాను రెండు నెలల క్రితం విడుదల చేశారు. అంతకుముందు ఒమర్ అబ్దుల్లా కూడా విడుదల అయ్యారు. అయితే మెహబూబా నిర్బంధాన్ని ( mehbooba detention ) మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో తన తల్లిని ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆమె కుమార్తె ఇల్తెజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తన తల్లిని నిర్బంధించడం అక్రమమని ఆరోపించారు. దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ముకశ్మీర్ అధికారులు కోర్టుకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని.. ఇది కోర్టు పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. అధికారులు తన తల్లిని కలిసేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం కోర్టు అనుమతి కోరారు. Also read: Virus Threat: భారత్ కు పొంచి ఉన్న ప్రమాదం, మరో ప్రాణాంతక వైరస్