మహేష్ బాబు మేనల్లుడి సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్

అందాల నటి, బెంగుళూరు భామ నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) ఇస్మార్ట్ శంకర్, సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది.

Last Updated : Aug 17, 2020, 10:05 PM IST
మహేష్ బాబు మేనల్లుడి సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్

అందాల నటి, బెంగుళూరు భామ నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) ఇస్మార్ట్ శంకర్, సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అయిన అశోక్ గల్లా తొలి చిత్రంలోనూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఐతే ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. ఈ రోజు నిధి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. Also read : Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్‌మెంట్ వార్తల్లో నిజమెంత ?

 

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్‌లో ట్రెండీ దుస్తులలో నిధి అగర్వాల్ ఎప్పటిలాగే చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మహేష్ బాబు అక్క పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గిబ్రాన్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. Also read : Personal Loan తీసుకుంటున్నారా ? మీ CIBIL score ఏంటో మీకు తెలుసా ?

Trending News