మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. పేరు చెప్పగానే కెప్టెన్ కూల్, బెస్ట్ ఫినిషర్, కూల్ మ్యాన్ అని అంటారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి తన అభిమానులతో పాటు క్రీడా ప్రపంచానికి షాకిచ్చాడు. అయితే ధోనీలో మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
‘ధోనీ జట్టులోకి వచ్చిన కొత్తలోనే రిటైర్మెంట్ గురించి కామెంట్లు చేసి డ్రెస్సింగ్ రూములో అందరికీ షాకిచ్చాడు. 2006లో ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై తన కెరీర్‌లోనే తొలి టెస్టు శతకం ఎంఎస్ ధోనీ సాధించాడు. పాక్ పర్యటనలో రెండో టెస్టులో సెంచరీ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూములో ధోనీ బాంబు పేల్చాడు. టెస్టుల్లో నేను శతకం చేశాను. ఇంతకుమించి నాకేం వద్దు. నేను రిటైర్మెంట్ ప్రకటిస్తా అన్నాడు. జట్టు మొత్తం ధోనీ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయిందని’ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ ఈవెంట్‌లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో విలక్షణ క్రికెటర్ లక్ష్మణ్ (VVS Laxman) ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. భారత్ కోసం ధోనీ సాధించిన ఘనతలు, అందించిన ట్రోఫీలు
టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ ధోనీ జట్టును మొత్తం అయోమయానికి గురిచేశాడని మరో ఘటనను లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. 2008లో నాగ్‌పూర్‌లో టెస్టు మ్యాచ్. అప్పుడు స్టేడియం నుంచి మా హోటల్ వరకు మహీనే బస్సు నడిపాడని తెలిపాడు. డ్రైవర్‌ను వెనక్కి వెళ్లమని చెప్పి.. స్టీరింగ్ చేతబట్టి రథసారథిగా మారిపోయి జట్టు సహచరులకు షాకిచ్చాడని పాత విషయాలను నెమరు వేసుకున్నాడు. Gautam Gambhir: ధోనీ రిటైర్మెంట్‌పై భిన్నంగా స్పందించిన గంభీర్
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
VVS Laxman: ‘రిటైర్మెంట్‌పై ధోనీ 2006లోనే షాకిచ్చాడు’
ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ
2006లోనే రిటైర్మెంట్ టాపిక్ తెచ్చాడని చెప్పిన లక్ష్మణ్
మరో సందర్భంలోనూ జట్టును అమోమయానికి గురిచేసిన ధోనీ