న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తన సెన్సాఫ్ హ్యూమర్ (CJI SA Bobde sense of humor) ప్రదర్శించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బార్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. శ్రీ కృష్ణుడు ఈరోజే జైలులో జన్మించాడు. మరి నీకు ఈరోజే బెయిల్ కావాలా.. అని జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీని జస్టిస్ బాబ్డే (CJI SA Bobde) ప్రశ్నిస్తూ చమత్కారాన్ని చూపించారు. అవునని సమాధానం రాగా, రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం.. వారి ఖాతాల్లోకి రూ.18,750
Chief Justice of India SA Bobde hears a case of an accused seeking bail.
CJI: Today Lord Krishna was born in jail. You want to leave jail?
Lawyer: yes...
CJI: Bail granted.. furnish 25,000 bond. Good you are not attached to religion to the extreme #courtroomexchange
— Bar & Bench (@barandbench) August 11, 2020
మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర వాల్వే హత్య కేసులో కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే శ్రీ కృష్ణుడు ఇదే రోజు జైల్లోనే పుట్టాడని.. అలాంటి రోజే నీకు జైలు నుంచి వెళ్లాలని ఉందా అని ఖైదీని ప్రశ్నించారు. Sara Ali Khan Birthday Special: సారా అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ గ్యాలరీ
పిటిషనర్ వాల్వే తరఫు లాయర్ అవునని సమాధానం ఇవ్వడంతో రూ.25వేల బాండ్‌తో బెయిల్ మంజూరు చేశారు. నీకు మతపరమైన పట్టింపులు అసలు లేవనుకుంటా అంటూ రాజకీయ నాయకుడు ధర్మేంద్ర వాల్వేకు బెయిల్ ఇచ్చారు. 25ఏళ్లు గడిచిపోవడంతో శిక్షను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీజేఐ సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ (CJI SA Bobde sense of humor) అని కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్ ఫొటోలు
CJI Bobde: కృష్ణుడు ఈరోజే జైలులో పుట్టాడు.. నీకు బెయిల్ కావాలా?