COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు. అందుకు అవసరమైన ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఏపీలో కరోనావైరస్ వ్యాప్తిపై సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan) సోమవారం సాయంత్రం ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, కరోనావైరస్ వ్యాప్తిపై ఇతర వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్... భవిష్యత్ పరిణామాలను ఎదుర్కోవడానికి వైద్య శాఖలో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. ( Govt jobs alert: వైద్య ఆరోగ్య శాఖలో 9700 ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ )
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడిక ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచి ( Awareness on COVID-19) వైరస్ మరింత వ్యాపించకుండా చూడటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని అన్నారు. కోవిడ్-19 క్లస్టర్ల వివరాలు, వాటి ఏరియా సైజ్ వివరాలు ఆరా తీసిన సీఎం వైఎస్ జగన్.. క్లస్టర్ల క్లాసిఫికేషన్ను మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి అని అధికారులకు సూచించారు. కోవిడ్-19 భాదితులు ఎవరైనా.. నేరుగా పరీక్షలు చేయించుకోవాలే కానీ.. స్టిగ్మా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అనే విషయంలో ప్రజల్లో అవగాహన వచ్చేలా ప్రచారం చేపట్టాలి. కరోనావైరస్ టెస్ట్లు ( COVID-19 tests) స్వచ్చందంగా ఎలా చేయించుకోవాలి ? ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి అనేదానిపైనే ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించండి. 14410, 104 నెంబర్లు ప్రజలకు తెలిసేలా మరింత ప్రచారం కల్పించండి అని చెబుతూ సీఎం వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. (
ఏపీలో తాజాగా 154 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట )
ఇటీవల శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సైతం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది కొరత వేధిస్తున్నందున సీఎం వైఎస్ జగన్తో చర్చించి వారం రోజుల్లోగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇవాళ సీఎం వైఎస్ జగన్ సైతం ఉద్యోగాల భర్తీపైనే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..