అమ్మ.. సృష్టిలో ఇంతకంటే అద్భుతమైన, అందమైన పదం మరొకటి ఉండదు. తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఆ త్యాగశీలి. కానీ పుట్టిన బిడ్డను తొలిసారి చూడగానే తన ప్రసవ వేదనను మరిచిపోయి సంతోషంలో మునిగి తేలుతుంది అమ్మ. నువ్వు ఏం పని చేసినా, అంద విహీనంగా ఉన్నా, తన బిడ్డే అందరి కంటే ఉత్తమమని, జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధిస్తావని నమ్మే తొలి వ్యక్తి అమ్మ మాత్రమే.
తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి. నేడు మాతృదినోవ్సం. Mothers Dayను పురస్కరించుకుని ఇలా అందమైన మాటలు, కోటేషన్స్‌తో అమ్మకు శుభాకాంక్షలు చెప్పేయండి.. Photos: తెలుగింటి అందం పూజిత పొన్నాడ
మన రేపటి బంగారు భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు
‘ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
’సృష్టిలో మనకు తొలి గురువు అమ్మే. తల్లిని మించిన దైవం లేదు. ఆమె త్యాగాలకు అంతులేదు. అందుకే అమ్మకు శతకోటి వందనాలు’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
‘ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నీకు ప్రేమను పెంచే వ్యక్తి అమ్మ మాత్రమేనని తెలుసుకో’. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
‘కనిపించే దైవం అమ్మ. మనల్ని కనిపించే ధైర్యం, త్యాగం అమ్మ. ప్రేమలో ఆమెకు సాటిలేరెవ్వరు’ Happy Mothers Day 2020
‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ..
పవిత్రమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ...
అపురూపమైన కావ్యం అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..’ అలాంటి అమ్మకు Happy Mothers Day
‘మనం చేసే ప్రతి పనిలోనే మంచిని వేతికే సహనశీలి, త్యాగమూర్తి మాతృమూర్తి ఒక్కరే’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
‘అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆ త్యాగమూర్తి గురించి ఎంత మాట్లాడినా ఏదో తెలియని వెలితి.
అందుకే అమ్మ అని పేరుని మించిన గొప్ప పదం ఇంకేముంటుంది’ Happy Mothers Day 2020
‘బిడ్డకు వెలుగు పంచేందుకు తన జీవితాన్ని కొవ్వొత్తిలా ధార పోసే త్యాగశీలికి నిదర్శనం అమ్మ’... మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నాన్నకైనా అప్పుడప్పుడూ విరామం దొరుకుతుంది. కానీ అమ్మకు ప్రతిరోజూ అదే పని. అంతే బిజీబిజీ జీవితం. తన గురించి ఆలోచించుకునే సమయం, ధ్యాస ఉందని వ్యక్తి అమ్మ.. హ్యాపీ మదర్స్ డే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!