హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత రైతాంగం ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నారని, రంగనాయక సాగర్ టన్నెల్ లోకి వచ్చిన గోదావరి జలాలను చూసి మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటల పాటు పరిశీలించిన ఆయన మరో రెండు, మూడు రోజుల్లో వెట్ రన్ కు సిద్ధం అవుతోందని అన్నారు.
Read Also: ఐసోలేషన్ సెంటర్ నుంచి పరారైన ఆరుగురు కరోనా రోగులు
కాగా సర్జిపూల్ లోకి వస్తున్న గోదావరి జలాల పంపింగ్ విధానాన్ని, పంప్ హౌస్ లో ప్రారంభానికి సిద్ధమైన 4 మోటారు పంపులను పరిశీలించి చేపట్టిన, చేపట్టాల్సిన అంశాలపై అధికారులను ఆరా తీశారు. ఈ మేరకు రంగనాయక సాగర్ టన్నెల్ లో వచ్చిన గోదావరి జలాలను చూసి మంత్రి ఇలాంటి శుభపరిణామం కోసం సిద్ధిపేట ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, ఈ ప్రాంత రైతుల కల సాకారం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Also read : COVID-19 cases in Telangana: తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు
ఇదిలాఉండగా ఇదంతా తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతరం టన్నెల్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఇరిగేషన్ శాఖ అధికారులతో, మేఘ ఇంజినీరింగ్ సిబ్బందితో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్ల పై సమీక్షించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..