ఇండోర్: ఐసోలేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనావైరస్ రోగులు, మరో ఇద్దరు అనుమానితులు కలిపి మొత్తం 8 మంది పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఓ హోటల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా... వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోడ దూకి పారిపోయారు. ఐసోలేషన్ సెంటర్ నుంచి పరారైన వీళ్లంతా 40-60 ఏళ్ల మధ్య వయస్సు వారే. ఐసోలేషన్ సెంటర్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన గాలింపు చేపట్టడంతో ముగ్గురు కరోనావైరస్ పాజిటివ్ కలిగిన రోగుల ఆచూకీ లభించింది. ఆ ముగ్గురు కరోనా రోగుల్లో ఇద్దరు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వారు కాగా మరొక పేషెంట్ రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వ్యక్తి. గత 17 రోజులుగా తాము ఐసోలేషన్‌లో ఉండి విసుగు చెందామని.. బుధవారం నాటి పరీక్షల్లో తమకు పాజిటివ్ అని తేలడంతో తమని ఆస్పత్రిలో చేరుస్తారనే భయాందోళనతోనే పరారయ్యామని ఆ ముగ్గురు చెప్పినట్టుగా ఇండోర్ పోలీసులు తెలిపారు.
Also read : COVID-19 cases in Telangana: తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు
పరారైన మిగితా ఐదుగురు ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌కి చెందిన వారే. ఆ ఐదుగురి కోసం గాలిస్తున్నామని.. రాంపూర్ జిల్లా యంత్రాంగం, పోలీసులకు సైతం ఈ విషయమై సమాచారం అందించినట్టు ఇండోర్ పోలీసులు వెల్లడించారు. ఇండోర్ లోని రాణిపుర అనే ప్రాంతంలో కరోనా ఎక్కువగా సోకడంతో అక్కడి నుంచి అనుమానితులుగా వీళ్లను తీసుకొచ్చి పరీక్షలు జరపగా వారికి కరోనా పాజిటివ్ ఉందని తేలిందని ఇండోర్‌లోని సంబంధిత అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఐసోలేషన్ సెంటర్ నుంచి పరారైన ఆరుగురు కరోనా రోగులు