NEET UG 2025 Exam Pattern: నీట్ యూజీ 2025 పరీక్ష విధానంలో కీలక మార్పు, ఇక అదనపు ప్రశ్నలు, సమయం ఉండదు

NEET UG 2025 Exam Pattern: నీట్ యూజీ 2025లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరీక్ష విధానంలో ఎన్టీఏ మార్పులు చేసింది. ఈ ఏడాది జరిగే నీట్ పరీక్షలో ఈ మార్పులు ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 26, 2025, 10:50 AM IST
NEET UG 2025 Exam Pattern: నీట్ యూజీ 2025 పరీక్ష విధానంలో కీలక మార్పు, ఇక అదనపు ప్రశ్నలు, సమయం ఉండదు

NEET UG 2025 Exam Pattern: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్ టెస్ట్ యూజీ పరీక్షవిధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని మార్పులు చేసింది. ఇకపై ఏడాది నీట్ యూజీ నుంచి అదనపు ఆప్షన్లు, సమయం ఉండదు. ఆ వివరాలు మీ కోసం..

నీట్ యూజీ 2025 సమయం దగ్గర పడుతోంది. గత ఏడాది నీట్ 2024 పరీక్షలో జరిగిన అవకతవకల నేపధ్యంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ఎన్టీఏ కరోనా సమయంలో అమలు చేసిన కొన్ని ఆప్షన్లను తొలగించింది. కరోనా మహమ్మారి సమయంలో అంటే 2021-22 విద్య సంవత్సరానికి జరిగిన నీట్ యూజీ పరీక్షలో విద్యార్ధులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రశ్నలు ఎంపిక చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి సెక్షన్ ఏ, సెక్షన్ బి విభజించారు. సెక్షన్ ఎలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ బి నుంచి 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే 180 ప్రశ్నలకు బదులు అదనంగా 20 ప్రశ్నలతో 20 ప్రశ్నలుండేవి. అంతేకాకుండా అదనంగా 20 నిమిషాల సమయం చేర్చారు. దాంతో 3 గంటల 20 నిమిషాల సమయం ఉండేది. ఇప్పటి వరకూ ఇదే అమలవుతూ వచ్చింది. 

ఇప్పుడు అంటే ఈ ఏడాది నీట్ యూజీ 2025 నుంచి మార్పులు చేసింది ఎన్టీఏ. తిరిగి పాత విధానాన్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. అంటే సెక్షన్ బి ఆప్షన్, అదనపు సమయం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలుండవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అంటే ఇకపై 180 ప్రశ్నలకు మూడు గంటల సమయం ఉంటుంది. గతంలో ఉన్నట్టే ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలుంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఉంటాయి. 

Also read: UPS Full Benefits: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం, ఎవరు అర్హులు, పెన్షన్ ఎంత, ఇతర లాభాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News