ఆ పేదవారికి ఎంత ఎంత కష్టం. కరోనా వైరస్ దెబ్బకు వారి జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయి. వందలకొద్దీ కిలోమీటర్లు కాలి నడకనే వెళ్లే పరిస్థితి దాపురించింది.
'కరోనా వైరస్'ను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. ఇప్పుడు ఈ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు, బస్సులు, ప్రయివేటు వాహనాలు అన్నీ బంద్ అయ్యాయి. వ్యాపారాలు ఆగిపోయాయి. దీంతో పేదవారికి బతుకు భారంగా మారింది. వారిని ఆదుకునేనాథుడే కరువయ్యాడు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మరింత దయనీయ స్థితిలోకి వెళ్లిపోయాయి.
శంషాబాద్ వద్ద ఘోర ప్రమాదం
బతుకుజీవుడా అంటూ పట్ణణాలకు వెళ్లిన వేలాది మంది ఇప్పుడు తమ కుటుంబాలతో సహా స్వస్థలాలకు తిరుగపయనమయ్యారు. అదీ వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్తున్నారు. ఢిల్లీలోని జాతీయ రహదారి 24 పొడవునా .. ఇప్పుడు వలస కూలీల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికి మూడు రోజుల నుంచి వారు నడుస్తూనే ఉన్నారు. దారిపొడవునా వేలాది మంది వలస కూలీలు కనిపించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు వారు కనీసం సామాజిక దూరం కూడా పాటించడం లేదు.
ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్, హరియాణా, ముంబై, హైదరాబాద్, బీహార్ లాంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..