MP Etela Rajendar Slaps Realtor: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏకశిలా నగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప చెళ్లుమనిపించారు. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుందన్నారు. పేదలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకున్న ఈటల.. అక్కడికి వెళ్లారు. 1985 లో నారపల్లి, కొర్రెముల గ్రామాలలో 149 ఎకరాల్లో వెంచర్ చేసి అమ్మారని.. భూమి కొనుక్కున్న వారు ఇళ్లు కట్టుకుందామని అనుకునేలోపు సదరు భూములను మళ్లీ అమ్ముకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని.. తాటాకు చప్పుళ్లకు భయపడదని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని గొర్రెముల గ్రామంలో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
"అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీ. పేదలు కొనుక్కున్న జాగాలకు బిజేపి సంపూర్ణంగా అండగా ఉంటుంది. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు. 1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 149 ఎకరాల్లో ఇల్లు కట్టని వారి జాగాలు మళ్ళీ మళ్ళీ అమ్ముకున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రి గారికి, సీఎం గారికి, ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుంది..
కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమీషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రొకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది." అని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.
సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా.. కబ్జాలకు పాల్పడిన బిల్డర్ అనుచరులు వీడియో తీశారు. ఈ క్రమంలో వారిని చూసిన ప్లాట్ ఓనర్స్ బిల్డర్ అనుచరులపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఈటల రాజేందర్.. బిల్డర్ అనుచరుల చెంప చెల్లుమనిపించారు. ఈటల అనుచురులు కూడా చేయి చేసుకున్నారు. దీంతో దెబ్బలు తిన్న రియల్టర్స్ అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు.
Also Read: Tabu: ఏం తమాషాగా ఉందా..?.. అసభ్య కథనాలపై స్పందించిన నటి టబు టీమ్.. ఏమన్నారంటే..?
Also Read: Kolkata Doctor Murder case: మమతా బెనర్జీ మరో సంచలనం.. ఆర్జీకర్ ఘటన తీర్పుపై హైకోర్టులో పిటిషన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.