America Out From WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ప్రస్తుతం అతిపెద్ద డోనర్ కూడా అమెరికానే. ఇక WHO ఆదేశాలతో ఈ సంస్థలకు ఇబ్బంది తప్పేలా లేదు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఇక పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి కూడా అమెరికా తప్పించుకోనున్నట్లు తెలిపారు.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించారు. క్యాపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన వివిధ ఆర్డర్లపై సంతకం చేశారు. అయితే అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగితే అది పెద్ద షాకిచ్చే విషయమే ఎందుకంటే ఏవైనా ప్రాణాంతక వ్యాధులు ప్రబలితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఆర్థిక సాయం అందదు. WHO కు అతిపెద్ద వనరు అమెరికానే. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా అమెరికా నుంచి ఏ నిధులు అందకుండా పోతాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'కింగ్ రిటర్న్' అంటూ ట్విట్ చేశారు.
ఇక పనామా కాలువను కూడా స్వాధీనం చేసుకుంటాం. స్వర్ణ యుగం మొదలైంది, ఎవరు ఊహించని విధంగా తన సైన్యాన్ని తయారు చేస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పనామా కాలువ ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది అంతేకాదు 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో'ను కూడా 'గల్ఫ్ ఆఫ్ అమెరికా' గా మారుస్తామని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని ట్రంప్ ప్రమాణ స్వీకారం సమయంలో ప్రకటించారు.
అమెరికా బలంగా తయారవుతుంది. ప్రపంచ దేశాల గౌరవాన్ని కూడా పొందుతుందని, ముఖ్యంగా అమెరికాలోని నేరాలను బహిష్కరించి నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ కూడా విధిస్తామని పూర్తిగా ధనిక దేశంగా మారుస్తామని చెప్పారు. అమెరికా రక్షణకు దక్షిణ సరిహద్దుకు దళాలను పంపుతాం. స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల ప్రపంచ అధినేతలు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇంకా ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ఉష చిలుకూరి భర్త ఆయన జెడి వ్యాన్స్ ఉపాధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తన భార్య చేతిలో బైబిల్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లలేనివారు ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. హైదరాబాద్‌లో 8 చోట్ల అధికారుల తనిఖీలు..
ట్రంప్‌కు ప్రధాని మోదీ కూడా అభినందలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన డ్రోనాల్డ్ ట్రంప్ కి ప్రధాన మోడీ శుభాభినందనలు తెలియజేశారు. 'నా మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తన పదవి కాలం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్న. ఇరుదేశాలు ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.
Read Also: మరోవారం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలెర్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.